Sumalatha Ambareesh: సీనియర్ నటి సుమలత ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆమె కుమారుడు అభిషేక్ వివాహం బెంగళూరులో వైభవంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాదఖ్ బిదపా కుమార్తె అవివా మెడలో అభిషేక్ మూడుముళ్లు వేశారు. బెంగళూరులోని ప్రముఖ ప్యాలెస్ లో వీరి పెళ్లి అత్యంత ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం జరిగిన ఈ వేడుకలో మాజీ ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు, సూపర్ స్టార్ రజనీ కాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాధిక, సుహాసిని మణిరత్నం లతో పాటు అలనాటి తారలతో పాటు అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూ వరులను ఆశ్వీరదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు రాగా.. నెటిజన్లు కొత్త జంటకు శుభా కాంక్షలు చెబుతున్నారు.