Viral Video: అసలు గొడవకు అదే కారణం.. పృథ్వీ-సప్నా గిల్ ఘటనలో బయటికొచ్చిన వీడియో..Prithvi Shaw-Sapna Gill case: పృథ్వీపై సప్నా గిల్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ముంబై పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత కేసును విచారించిన అధికారి కూడా కోర్టుకు నివేదిక సమర్పించారు.Prithvi Shaw-Sapna Gill Case: ఫిబ్రవరిలో ముంబైలోని ఓ హోటల్లో టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా, నటి సప్నా గిల్ (Prithvi Shaw-Sapna Gill) మధ్య జరిగిన సెల్ఫీ వివాదం క్రికెట్ ప్రపంచంలోనే సంచలనంగా మారింది. గొడవ నుంచి కేసు వరకు ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 15న ముంబైలోని ఓ హోటల్లో క్రికెటర్ పృథ్వీ షా సెల్ఫీ విషయంలో నటి సప్నా, ఆమె స్నేహితుడు శోభిత్ ఠాకూర్‌తో వాగ్వాదానికి దిగారు. విషయం ఎంతగా పెరిగిందంటే నటి సప్న, ఆమె స్నేహితుడు శోభిత్ ఠాకూర్ హోటల్ బయట బేస్ బాల్ తో పృథ్వీ షాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. పృథ్వీ షా కారును కూడా వెంబడించి కారును అడ్డుకుని కారు అద్దాలు పగలగొట్టాడు. ఆ తర్వాత పృథ్వీ, సప్నలపై పోలీసు కేసు నమోదైంది.వైరల్‌గా మారిన ఘటన వీడియో..
దీని తర్వాత సప్నా, పృథ్వీతోపాటు ఆయన స్నేహితులపై కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో తెరపైకి రావడంతో ఈ పోరు ఎక్కడి నుంచి మొదలైందో క్లియర్ గా అర్థమవుతుంది. వీడియోలో చూసినట్లుగా, పృథ్వీ షా తన స్నేహితులతో కలిసి పబ్‌లో సరదాగా చిందులేస్తున్నాడు. అదే సమయంలో ఒక వ్యక్తి పృథ్వీతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈసారి ఆ వ్యక్తి పృథ్వీ భుజాలపై చేయి వేశాడు. పృథ్వీకి ఇది నచ్చ లేదు. దీంతో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. తరువాత, షా స్నేహితుడు ఇద్దరినీ వేరు చేయడానికి ప్రయత్నించాడు. అయితే వారిద్దరినీ శాంతింపజేయడం ఎంత కష్టమో వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కొద్దిసేపటికే వాతావరణం మరింత దిగజారడంతో ఇద్దరూ కొట్టుకునే వరకు వెళ్లారు. అయితే గతంలో స్వప్న గిల్ ఆరోపించినట్లుగా షా, అతని స్నేహితులు హోటల్ లోపల ఆమెతో అనుచితంగా ప్రవర్తించారని వీడియోలో స్పష్టమైన ఆధారాలు కనిపించడం లేదు.
ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన పోలీసులు..
అయితే పృథ్వీపై సప్నా గిల్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని ముంబై పోలీసులు అంతకుముందు మేజిస్ట్రేట్ కోర్టులో పేర్కొన్నారు. ఆ తర్వాత కేసును విచారించిన అధికారి కూడా కోర్టుకు నివేదిక సమర్పించారు. నివేదికను దాఖలు చేసిన తర్వాత, ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని చూపించేందుకు గిల్ తరపు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియోను గిల్ స్నేహితుడు తన ఫోన్ లో రికార్డ్ చేసినట్లు సమాచారం.