Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. ఓ వైపు అసమ్మతి నేతలతో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు రాజకీయంగా బలపడేందుకు బీజేపీ వ్యూహాలకు పదును పెడుతుతోంది.
Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంపై ఫుల్ ఫోకస్ చేస్తున్నారు. ఓ వైపు అసమ్మతి నేతలతో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేందుకు రాజకీయంగా బలపడేందుకు బీజేపీ వ్యూహాలకు పదును పెడుతుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర నాయకత్వంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులపై పూర్తిగా ఫోకస్ చేసింది. ప్రధానంగా ముఖ్యనేతల మధ్య సమన్వయం ఏర్పడటంతో దానిని పూడ్చేందుకు.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో అధిష్టానం భేటీ అయింది. దీంతోపాటు.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ విస్తరణ, వ్యూహాలపై చర్చ జరిపింది. అంతేకాకుండా పార్టీని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు, ఎత్తుగడలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణలో పర్యటించారు. ఆదివారం సాయంత్రం నాగర్ కర్నూల్లో జరిగే.. బీజేపీ ‘నవ సంకల్ప సభ’ భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. ఈ సభలో తొమ్మిదేళ్ల మోడీ పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మాట్లాడతారని పేర్కొంటున్నారు. అయితే, నడ్డా పర్యటన పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని పేర్కొంటున్నారు.
కాగా.. తెలంగాణ పర్యటనలో భాగంగా జేపీ నడ్డా.. ఆదివారం మధ్యాహ్నం 12.30 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. అనతరం ప్రొ.నాగేశ్వర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనంద శంకర్ జయంత్ తో భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 5 -6 గంటల మధ్య నాగర్కర్నూల్ జెడ్పీ హైస్కూల్ మైదానంలో బహిరంగసభలో పాల్గొంటారు. అయితే, జేపీ నడ్డా.. రాష్ట్ర ముఖ్యనేతలతో కూడా భేటీ అవుతారని పేర్కొంటున్నారు.
ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటం.. మరోవైపు పార్టీలో గందరగోళం పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జేపీ నడ్డా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.