Bigg Boss 7 Telugu: అన్నయ్యా అని పిలిస్తే అంత చులకనా.. అమర్ పై అర్జున్ కన్నింగ్ ప్రేమ.. నిజస్వరూపం ఇదా ?.
మొదటి వారం నామినేషన్స్ నుంచి ఇప్పటివరకు అమర్ దీప్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. బిగ్‌బాస్ ఇంట్లోకి హీరోలగా వెళ్లిన అమర్ తన తొందరపాటు.. ఇతర కంటెస్టెంట్స్ పై నోరు జారడం.. అనవసరమైన రచ్చ చేయడం ద్వారా నెగిటివిటిని మూటగట్టుకున్నాడు. ఇక టాస్కులలో పొరపాట్లు చేయడంతో చాలాసార్లు నాగార్జునతో చివాట్లు తిన్నాడు. అయితే ఐదువారాల తర్వాత తన ఆట తీరులో కాస్త చేంజ్ చేసుకున్నాడు అమర్.బిగ్‌బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం కెప్టెన్‌గా శోభా శెట్టి గెలిచింది. కాదు.. అమర్ దగ్గరుండి మరీ శోభాను కెప్టెన్ చేశాడు. శుక్రవారం జరిగిన ఎపిసోడ్లో కెప్టెన్ టాస్కులో శోభా బ్యాగ్ ధరించిన అమర్.. మిగతా కంటెస్టెంట్స్ పై రెచ్చిపోయి ప్రవర్తించాడు. అది టాస్కులో భాగమే అయినా.. అవసరానికి మించి హైపర్ అయ్యాడు. మొత్తానికి ఫస్ట్ లేడీ కెప్టెన్‌గా నిలిచింది. అయితే నిన్నటి ప్రవర్తనతో అమర్‌కు కాస్త నెగిటివ్ అయినా.. అంతకుమించి పాజిటివ్ అయ్యింది. అయితే మొదటి వారం నామినేషన్స్ నుంచి ఇప్పటివరకు అమర్ దీప్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తుంది. బిగ్‌బాస్ ఇంట్లోకి హీరోలగా వెళ్లిన అమర్ తన తొందరపాటు.. ఇతర కంటెస్టెంట్స్ పై నోరు జారడం.. అనవసరమైన రచ్చ చేయడం ద్వారా నెగిటివిటిని మూటగట్టుకున్నాడు. ఇక టాస్కులలో పొరపాట్లు చేయడంతో చాలాసార్లు నాగార్జునతో చివాట్లు తిన్నాడు. అయితే ఐదువారాల తర్వాత తన ఆట తీరులో కాస్త చేంజ్ చేసుకున్నాడు అమర్.అయితే బయట తన గురించి ఎంత నెగిటివిటీ, ట్రోలింగ్స్ జరుగుతున్నాయో తనకు తెలియదు. అప్పటికీ తన భార్య తేజు నుంచి వచ్చిన ఉత్తరాన్ని కూడా సందీప్ కోసం త్యాగం చేశాడు. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన తన క్లోజ్ ఫ్రెండ్ అర్జున్ సైతం అమర్‌కు దూరంగానే ఉంటున్నాడు. ఐదువారాలు ఆట చూసి.. బయట ఏం జరుగుతుందో పూర్తిగా తెలిసిన అర్జున్.. ఇంట్లోకి వెళ్లడం అమర్ కు ప్లస్ అవుతుందనుకున్నారు. హౌస్ లోకి అడుగుపెట్టిన అర్జు్న్ ను చూడగానే పరుగున వచ్చి అతడిని పట్టేసుకున్నాడు. కానీ అర్జున్ మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఇక వచ్చిన మొదటివారమే అమర్ ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత అయిన అమర్ తో స్నేహం, కనీసం మాట కూడ కలపడం లేదు. ఇక అమర్ గురించి అర్జున్ చెత్తగా మాట్లాడిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.అందులో తేజ, గౌతమ్ దగ్గర కూర్చొని అమర్ దీప్ గురించి చెత్తగా మాట్లాడుతూ.. అతడిని మరింత హేళన చేశాడు. ‘ఆడికి (అమర్ దీప్)కు దూరంగా ఉండాలన్నా అవ్వడం లేదు. ఆడే వస్తున్నాడు.. అన్నియ్యా.. అన్నియ్యా అంటున్నాడు.. ఏంట్రా నాకు ఇదీ’ అంటూ హేళన చేస్తూ మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అర్జున్ పై ఫైర్ అవుతున్నారు. అర్జున్ను సొంత అన్నయ్యలాగా చూస్తున్న అమర్ పై అర్జున్ ఇలా మాట్లాడడం ఏంటని.. ఐదు వారాలు ఆట చూసి వెళ్లిన అర్జున్ కప్పు కోసం కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడని అంటున్నారు.