ICC World Cup 2023: New Zealand Win The Toss And Elect To Bowl First Against Australia, Head And Neesham Returns
AUS vs NZ: ధర్మశాలలో ఆసీస్ వర్సెస్ కివీస్.. టాస్ గెల్చిన న్యూజిలాండ్.. రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ ఆటగాళ్లు
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 28) ధర్మశాల వేదికగా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ముఖాముఖి తలపడుతున్నాయి. టైటిల్ కోసం ఇరు జట్లూ గట్టి పోటీదారులే. టోర్నమెంట్లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. మరోవైపు ఆరంభంలో వరుస ఓటములు ఎదురైనా ఆసీస్ దారిలో పడింది. సెమీస్ రేసులో నిలిచింది.వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 28) ధర్మశాల వేదికగా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు ముఖాముఖి తలపడుతున్నాయి. టైటిల్ కోసం ఇరు జట్లూ గట్టి పోటీదారులే. టోర్నమెంట్లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళుతోంది. మరోవైపు ఆరంభంలో వరుస ఓటములు ఎదురైనా ఆసీస్ దారిలో పడింది. సెమీస్ రేసులో నిలిచింది. అయితే నాకౌట్ ఆశలను మరింత పటిష్టం చేసుకోవాలంటే న్యూజిలాండ్‌పై తప్పక విజయం సాధించాల్సి ఉంది. ఈ న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ తర్వాత, ఇద్దరు కెప్టెన్లు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పుల గురించి కూడా చెప్పారు. న్యూజిలాండ్ జట్టులో మార్క్ చాప్మన్ స్థానంలో జిమ్మీ నీషమ్ చోటు దక్కించుకున్నట్లు కెప్టెన్ టామ్ లాథమ్ తెలిపాడు. అలాగే ఆస్ట్రేలియా తన ప్లేయింగ్ ఎలెవన్‌లో ట్రెవిస్ హెడ్‌కు స్థానం కల్పించింది. స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. కాగా న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్‌కి ఇది 100వ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం.కాగా ఈ ప్రపంచకప్ భారత్, సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచుల్లో ఆస్ట్రేలియా పరాజయం పాలైంది. అయితే ఆ తర్వాత శ్రీలంక, పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే.. ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ జట్లను వరుసగా ఓడించింది. అయితే చివరగా భారత్‌తో జరిగిన మ్యాచులో మాత్రం 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ప్రస్తుతం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు పాయింట్ల పట్టికలో వరుసగా 3, 4వ స్థానాల్లో ఉన్నాయి.
న్యూజిలాండ్ ప్లేయింగ్-XI :
డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డేరిల్ మిచెల్, టామ్ లేథమ్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, లూకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్
ఆస్ట్రేలియా ప్లేయింగ్-XI :
డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్