Fake Police Stolen 18 Lakh Rupees Money In Panjagutta Hyderaad, Ahead Of Telangana Elections
Hyderabad: ఎన్నికల సీజన్‌ను కూడా వాడేస్తున్న కేటుగాళ్లు.. రోడ్లపై తనిఖీలు చేపడుతూ..
ఎన్నికల కోడ్ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు ఈ తనిఖీలలో భాగంగా పెద్ద మొత్తంలో డబ్బులు బంగారం పట్టుపడుతున్నాయి అయితే తనిఖీల్లో భాగంగా నకిలీ పోలీసులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇలా రంగంలోకి దిగిన పోలీసులు దొరికిందంతా దోచుకుని పరారవుతున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాహన తనికీల్లో భాగంగా నకిలీ పోలీసులు రంగంలోకి దిగుతున్నారు…ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. తెలంగాణ అసెంబ్లీకి ఇంకా నెల రోజులే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక ఎన్నికల వేళ డబ్బులు పట్టుబడడం సర్వసాధారణమైన విషయమే. అయితే ఇదే ఆసరాగా చేసుకొని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తనిఖీల పేరుతో దొరికినకాడికి దోచుకుంటున్నారు.ఎన్నికల కోడ్ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు ఈ తనిఖీలలో భాగంగా పెద్ద మొత్తంలో డబ్బులు బంగారం పట్టుపడుతున్నాయి అయితే తనిఖీల్లో భాగంగా నకిలీ పోలీసులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇలా రంగంలోకి దిగిన పోలీసులు దొరికిందంతా దోచుకుని పరారవుతున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాహన తనిఖీల్లో భాగంగా నకిలీ పోలీసులు రంగంలోకి దిగుతున్నారు, తాము పోలీసులమంటూ వాహనాలను తనిఖీ చేయాలి అని దొరికిన డబ్బులు దోచుకుని వెళ్తున్నారు.
తాజాగా ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమిరైట్స్ వద్ద కొందరు వ్యక్తులు వాహన తనిఖీలు చేపట్టారు అందులో భాగంగా అక్కడికొచ్చిన ఒక కారును తనిఖీలు చేయగా కారులో మొత్తం 20 లక్షలు గుర్తించారు. అందులో రూ. 18 లక్షలు తీసుకొని కోటి మీదుగా సంతోషనగర్ ఐఎస్ సదన్ చంపాపేట్ వైపుగా వెళ్లారు. అయితే కారులో ప్రదీప్, శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. డబ్బులు తీసుకొని వెళ్లిన తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు ఓనర్‌కు తెలియజేసి పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించగా కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. తనిఖీల పేరుతో 18 లక్షల రూపాయలను కొట్టేసిన కేటుగాల్లలో ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బేగం బజార్ కు చెందిన ఓ వ్యాపారి డ్రైవర్ కు మరొక ఉద్యోగికి డబ్బులను ఇచ్చి పంపించగా, తాము పోలీస్ అధికారులమని తనిఖీలలో పట్టుపడ్డారు. ఇక తనిఖీలు చేసింది నకిలీ పోలీసులు అని ఎలా తెలిసిందనేది ప్రశ్నగా మారింది.
అయితే నిందితులు పోలీసు వాహనంలో వచ్చినట్లు ఫిర్యాదు రావడంతో అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ దారి దోపిడీ కేసు గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అదుపులో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం ఆ ఇద్దరు వ్యక్తుల్లోనే కానిస్టేబుల్ సైతం కూడా ఉన్నాడా, ఈ కేసులో అసలు నిందితులు ఎంతమంది ఉన్నారనే దానిపై పోలీసులు కూపి లాగుతున్నారు.