AP Skill Case: స్కిల్ కేసులో రెండు కీలక పిటిషన్లపై హైకోర్టు విచారణ.. కీలకంగా మారనున్న చంద్రబాబు హెల్త్ రిపోర్ట్
చంద్రబాబు పిటిషన్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. క్వాష్ పిటిషన్‌పై తీర్పును ఇంకా రిజర్వులోనే పెట్టింది సుప్రీం. మిగతా కేసులు, పిటిషన్లలోనూ వాయిదాలపర్వం కంటిన్యూ అవుతోంది. ఈనేపథ్యంలోనే స్కిల్ డెవలెప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హై కోర్టు ఇవాళ విచారణ చేయనుంది. దీనిపై ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది.చంద్రబాబు పిటిషన్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. క్వాష్ పిటిషన్‌పై తీర్పును ఇంకా రిజర్వులోనే పెట్టింది సుప్రీం. మిగతా కేసులు, పిటిషన్లలోనూ వాయిదాలపర్వం కంటిన్యూ అవుతోంది. ఈనేపథ్యంలోనే స్కిల్ డెవలెప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హై కోర్టు ఇవాళ విచారణ చేయనుంది. దీనిపై ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది.స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నెల 19న హైకోర్టులో ఈ పిటిషన్ పై వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని సరైన టెస్టులు చెయ్యటం లేదని మెమో దాఖలు చేశారు చంద్రబాబు తరుఫు న్యాయవాదులు. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ లో ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వడం కుదరదన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, తదుపరి వాదనలు దసర తర్వాతకు వాయిదా వేసింది. దీంతో చంద్రబాబు తరుపు న్యాయావాదులు వెకేషన్ బెంచ్‌కు వేయాలని కోరారు. దాన్ని అంగీకరించిన హైకోర్ట్ వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబుకు సంబంధించిన వైద్య నివేదికలను అక్టోబర్ 27నాటి విచారణకు కోర్టు ముందు ఉంచాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులను ఆదేశించింది కోర్టు. దీనిపై ఇవాళ వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మధ్యంతర బెయిల్ విచారణ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందు 8వ కేసుగా లిస్ట్ అయింది. మరోవైపు ఏపీ హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరుపు న్యాయవాదులు. ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ వెకేషన్ బెంచ్ ముందుకు మధ్యంతర బెయిల్ పిటిషన్ వచ్చే అవకాశం ఉంది.చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా మధ్యతర బెయిల్ మంజూరు చేయాలని అధికారులను కోరుతూ పిటిషన్ వేశారు. హెల్త్ రిపోర్ట్‌లను అటాచ్ చేస్తూ కంటికి ఆపరేషన్ చేయాలంటూ మద్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మూడు నెలల క్రితమే చంద్రబాబు ఎడమ కంటికి ఆపరేషన్ జరిగిందని రిపోర్ట్లు అటాచ్ చేశారు న్యాయవాదులు. కుడి కంటికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉందంటున్నారు బాబు లాయర్లు. చంద్రబాబు ఆరోగ్యంపై ఇప్పటికే మెమో వేసింది సీఐడీ. అయితే ఇవాళ్టి విచారణలో చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ కీలకంగా మారనుంది. ఇక సుప్రీం కోర్ట్‌లో క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్ లో ఉన్నందున నేడు హై కోర్ట్‌లో విచారణపై ఉత్కంఠ నెలకొంది.