Bigg Boss 7 Telugu: ఇదెక్కడి టాస్క్ రా బాబు.. దొరికిన కాడికి బట్టలేసుకోమన్నా బిగ్బాస్.. హౌస్మేట్స్ తిప్పలు..
ఇక ఈరోజు ఉదయం రిలీజ్ చేసిన మొదటి ప్రోమోలో మాత్రం మళ్లీ ఫిజికల్ టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో అర్జున్, అశ్విని, భోలే, సందీప్ పోటీ పడ్డారు. ఇక ఇప్పుడు విడుదలైన ప్రోమోలో మరోసారి కంటెస్టెంట్లను ఉరుకులు పరుగులు పెట్టించాడు. ఇప్పటికే ప్రియాంక, ప్రశాంత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్ కాగా.. ఈరోజు పెట్టిన టాస్కులలో సందీప్, గౌతమ్ గెలిచి మరో ఇద్దరు కంటెండర్స్ అయ్యారు. దీంతో ఓడిపోకుండా ఉన్న మిగిలిన ఐదుగురికి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్..
కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నాడు బిగ్బాస్. కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యేందుకు నానా తిప్పలు పడుతున్నారు హౌస్మేట్స్. గత రెండు రోజులుగా వరుసగా కెప్టెన్సీ టాస్కులు అంటూ కంటెస్టెంట్లను ఓ ఆట ఆడిస్తున్నాడు. ఇన్ని రోజులు ఫిజికల్ టాస్కులు ఇచ్చి ఒళ్లు హునమయ్యేలా ఆటాడించిన బిగ్బాస్.. ఈ వారం మాత్రం మొదట్లోనే బుర్రకు పదును పెట్టే పని చెప్పారు. కంటెస్టెంట్స్ తెలివి తేటలకు సవాల్ విసురుతూ మొదటి రెండు టాస్కులు ఇచ్చారు. ఇక ఈరోజు ఉదయం రిలీజ్ చేసిన మొదటి ప్రోమోలో మాత్రం మళ్లీ ఫిజికల్ టాస్క్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో అర్జున్, అశ్విని, భోలే, సందీప్ పోటీ పడ్డారు. ఇక ఇప్పుడు విడుదలైన ప్రోమోలో మరోసారి కంటెస్టెంట్లను ఉరుకులు పరుగులు పెట్టించాడు. ఇప్పటికే ప్రియాంక, ప్రశాంత్ గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్ కాగా.. ఈరోజు పెట్టిన టాస్కులలో సందీప్, గౌతమ్ గెలిచి మరో ఇద్దరు కంటెండర్స్ అయ్యారు. దీంతో ఓడిపోకుండా ఉన్న మిగిలిన ఐదుగురికి ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్..తేజ, యావర్, అర్జు్న్, అశ్విని, శోభాలలో చర్చించుకొని కేవలం ముగ్గురు మాత్రమే ఈ గేమ్ ఆడాలని సూచించాడు. ఇందులో ఎవరు గెలిస్తే వారు కెప్టెన్సీ కంటెండర్ అవుతారన్నమాట. ఇక శోభాతో గొడవ తట్టుకోలేక అర్జున్, అశ్విని పోటీ నుంచి తప్పుకోగా.. యావర్, తేజ, శోభా ఈ గేమ్ ఆడారు. గేమ్ విషయానికి వస్తే.. ఎవరైతే ఎక్కువగా బట్టలు వేసుకుంటారో వారే విజేత. బజర్ మోగగానే యావర్, తేజ, శోభా లోపలికి వెళ్లి దొరికినవి దొరికినట్లుగా బట్టలు వేసుకున్నారు. ముఖ్యంగా తేజ కనిపించిన బట్టలన్నీ వేసేసుకున్నాడు. అటు యావర్, శోభా కూడా తమకు దొరికినన్ని బట్టలు వేసుకున్నారు. తేజకు అమర్, శోభాకు ప్రియాంక సాయం చేసింది. బజర్ మోగడంతో శివాజీని ఎవరెన్నీ బట్టలు ధరించారో లెక్కించాలని ఆదేశించాడు.దీంతో ఒక్కరు ధరించిన దుస్తులు తొలగించారు. ముఖ్యంగా తేజ మాత్రం తన కంటికి కనిపించిన ప్రతి డ్రెస్ ధరించేశాడు. అమ్మా్యిలు చూస్తూ ఉండడంతో రేయ్ అటు తిరగండ్రా ప్లీజ్ ఇబ్బందిగా ఉంది అంటూ రిక్వెస్ట్ చేశాడు తేజ. దీంతో అశ్విని కళ్లు మూసుకుంది. ఇంతలో నేను లెక్కపెడితే 72 వచ్చాయ్ అన్నా అంటూ శివాజీతో అన్నాడు గౌతమ్. నాకు అన్యాయం జరిగితే ఒప్పుకోను చెబుతున్నా అంటూ ఫైర్ అయ్యాడు తేజ. చివరిగా ఎవరు గెలిచారో ప్రకటించండి శివాజీ అంటూ బిగ్బాస్ అన్నాడు. అయితే ఈ టాస్కులో ఎవరో గెలిచారో చూడాలి.