33 ఏళ్ల తర్వాత.. ఒకే సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్స్. రజనీకాంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..
కొన్ని రోజుల క్రితం లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘తలైవర్ 170’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అమితాబ్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. చివరిసారి వీరిద్దరు 1991లో వచ్చి ‘హమ్’ అనే హిందీ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా రానుంది. ఈ వార్త బయటకు రాగానే…ఇండియన్ ఫిలిమ్ ఇడస్ట్రీ మరో అద్భుతానికి వేదకకానుంది. 33 ఏళ్ల తర్వాత ఇద్దరు దిగ్గజ నటులు స్క్రీన్‌ను షేర్ చేసుకోనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కలిసి నటించనున్నారు. లైకా మూవీస్ తెరకెక్కిస్తున్న సినిమాలో అమితాబ్ నటిస్తున్న విషయం తెలిసిందే.కొన్ని రోజుల క్రితం లైకా ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ‘తలైవర్ 170’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అమితాబ్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. చివరిసారి వీరిద్దరు 1991లో వచ్చి ‘హమ్’ అనే హిందీ సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా రానుంది. ఈ వార్త బయటకు రాగానే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సౌత్ టాప్ హీరో ఒకరు. నార్త్ టాప్ హీరో మరొకరు. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడంతో ఇది కదా అసలైన పాన్ ఇండియా మూవీ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జైలర్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్న రజనీ నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు అదే స్థాయిలో పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రంలో అమితాబ్ సైతం నటిస్తుండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. ఇదిలా ఉంటే తన సినిమాలో అమితాబ్ నటిస్తున్న విషయాన్ని రజనీకాంత్ అధికారికంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోతో పాటు.. ’33 ఏళ్ల తర్వాత టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘తలైవర్ 170’లో నా గురువు శ్రీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి మళ్లీ పని చేస్తున్నాను. నా హృదయం ఆనందంలో ఉంది’ అంటూ రజనీ రాసుకొచ్చారు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే ఇంకా ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేయలేదు. ఈ సినిమాను పూర్తి స్థాయి పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్ అన్ని ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖ నటీనటులు ఇందులో నటించనున్నారు. ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ కీలక పాత్ర పోషించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. చిత్రీకరణ సమయంలోనే ఈ సినిమా ఇంతలా వార్తల్లో నిలుస్తుంటే, విడుదల తర్వాత మరెన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.