సుప్రీంలో క్వాష్ పిటిషన్పై ఇవాళ తీర్పు..! ఇప్పటికైనా చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందా.?
Chandrababu Naidu Arrest: అందరి కళ్లూ అటు వైపే. ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది.. క్వాష్ పిటిషన్ కొట్టివేతకు గురవుతుందా.. చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందా.. మేమే కరెక్ట్ అంటున్న సీఐడీ వాదనే గెలుస్తుందా.. ఇన్ని ప్రశ్నలూ జవాబు కోసం ఎదురుచూస్తున్నాయి. ఏపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇవాళ కీలక మలుపు తీసుకోబోతోంది.అమరావతి, అక్టోబర్ 20: అందరి కళ్లూ అటు వైపే. ఇవాళ సుప్రీంకోర్టులో ఏం జరగబోతోంది.. క్వాష్ పిటిషన్ కొట్టివేతకు గురవుతుందా.. చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందా.. మేమే కరెక్ట్ అంటున్న సీఐడీ వాదనే గెలుస్తుందా.. ఇన్ని ప్రశ్నలూ జవాబు కోసం ఎదురుచూస్తున్నాయి. ఏపీ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసు ఇవాళ కీలక మలుపు తీసుకోబోతోంది. అటు… టీడీపీ- వైసీపీల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై ఫోకస్ పెరిగింది.నాపై పెట్టిన కేసు చెల్లదు, కొట్టివేయండి అంటూ మాజీ సీఎం చంద్రబాబు పెట్టుకున్న క్వాష్ పిటిషన్పై ఇవాళ తీర్పు వచ్చే అవకాశముంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 43 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుకు రిలీఫ్ దొరుకుతుందా లేదా అనే ఉత్కంఠకు తెరపడబోతోంది. హైకోర్టులో కొట్టేసిన ఈ పిటిషన్పై సుప్రీంకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం తరఫున రెండుగంటలపాటు సాగిన వాదనల్ని విన్న తర్వాత తీర్పును రిజర్వులో ఉంచింది ధర్మాసనం. కానీ.. ఎప్పుడు తీర్పు వెలువరిస్తామన్నది స్పష్టం చెయ్యలేదు. రేపటినుంచి ఈనెల 29 వరకు కోర్టుకు దసరా సెలవులు కనుక.. తీర్పు ఇవాళ వెలువరించకపోతే 30 దాకా ఆగాల్సిందే.
స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ చంద్రబాబు తరఫు లాయర్లు వాదిస్తూ వస్తున్న అంశం సెక్షన్ 17-ఏ. ప్రజాజీవితంలో ఉన్న ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే అతడిని నియమించిన వ్యవస్థ అనుమతి తప్పనిసరి… అనేది ఈ సెక్షన్ సారాంశం. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా ఆధారాల్లేని కేసులు పెట్టకుండా నివారించే ఉద్దేశంతో వచ్చిన సెక్షన్ ఇది. అవినీతి నిరోధక చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం.. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై కేసు పెట్టడం చెల్లదన్నది చంద్రబాబు తరఫు లాయర్ల వాదన.చట్టంలోకి ఈ సెక్షన్ రాకముందే అంటే… 2018లో నేరం జరిగింది కనుక చంద్రబాబు అరెస్టు విషయంలో 17-ఏ వర్తించదు.. అనేది ప్రభుత్వం తరఫున సీఐడీ చేస్తున్న వాదన. 2021లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఎఫ్ఐఆర్ దాఖలైందని, చంద్రబాబు పేరు కూడా లేని ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగానే అరెస్ట్ జరిగిందని.. అందుకే ఈ సందర్భంలో సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని బాబు తరఫు లాయర్లు గట్టిగా వాదించారు.
కేసు ఎప్పుడు పుట్టింది… విచారణ ఎప్పుడు మొదలైంది.. అంటూ సాంకేతికపరమైన అంశాలచుట్టూనే వాదన కొనసాగిస్తున్నారని, అవినీతి జరిగిందా లేదా అనే అంశాన్ని మాత్రం విస్మరిస్తున్నారని చంద్రబాబు లాయర్ల తీరుపై విమర్శలొస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబుకు సెక్షన్ 17-A వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు తేలిస్తే.. కేసు దాదాపుగా కొట్టివేతకు గురైనట్టే. కానీ… చంద్రబాబుకు సంపూర్ణంగా రిలీఫ్ దొరుకుతుందన్న భరోసా ఐతే లేదు. మరింత కీలకమైన IPC 409… విశ్వాసఘాతుకం అనే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్టుకి సంబంధించి మరో కేసును ఎదుర్కొంటున్నారు చంద్రబాబు.
ఇటు… గవర్నర్ అనుమతి తీసుకుని చంద్రబాబుపై మళ్లీ కేసు పెట్టండి అని సీఐడీని సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం కూడా ఉంది. కేసు నుంచి పూర్తి రిలీఫ్ కావాలంటే దిగువ కోర్టుకు వెళ్లాలని చంద్రబాబుకు సూచించనూవచ్చు. ఏదేమైనా… క్వాష్ పిటిషన్పై ఇవాళ తీర్పు వస్తే… చంద్రబాబు కేసుల పరంపరలో కచ్చితంగా ఇదొక కీలక పరిణామమే. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-Aకి సంబంధించిన ఈ తీర్పు… న్యాయవ్యవస్థలో ఒక బెంచ్మార్క్ కాబోతోంది. అందుకే.. చంద్రబాబుతో పాటు.. దేశంలోని మిగతా పొలిటికల్ సర్కిల్స్ అన్నీ ఈ తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.