Andhra Pradesh: సీఎం జగన్ విశాఖ షిఫ్టింగ్ దసరాకు లేనట్లే.. మరి ఎప్పుడంటే..?
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకు మాకం మార్చడం ఆలస్యం కానుంది. విజయదశమికి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తారని.. అక్కడి నుంచే పాలన చేస్తారని గతంలో వైసీపీ నేతలు ప్రకటించారు.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి విశాఖ రాకకోసం వికేంద్రీకరణ జేఏసీ కూడా విశాఖపట్నంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేయాలని సమావేశం కూడా పెట్టుకుంది. మూడు ప్రాంతాల అభివృద్ది మా లక్ష్యం..
Andhra Pradesh: సీఎం జగన్ విశాఖ షిఫ్టింగ్ దసరాకు లేనట్లే.. మరి ఎప్పుడంటే..?విజయవాడ, అక్టోబర్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకు మాకం మార్చడం ఆలస్యం కానుంది. విజయదశమికి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తారని.. అక్కడి నుంచే పాలన చేస్తారని గతంలో వైసీపీ నేతలు ప్రకటించారు.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి విశాఖ రాకకోసం వికేంద్రీకరణ జేఏసీ కూడా విశాఖపట్నంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేయాలని సమావేశం కూడా పెట్టుకుంది. మూడు ప్రాంతాల అభివృద్ది మా లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. ఇక విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసి అక్కడి నుంచే సమీక్షలు కూడా చేయడం ద్వారా సమగ్రాభివృద్ది లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు అవుతుందని కూడా భావించారు. ఇక వైఎస్సార్ సీపీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి వంటి ముఖ్య నేతలు కూడా సీఎం విశాఖకు షిఫ్ట్ అవుతున్నారని చెప్పారు…దీంతో దసరా శరన్నవరాత్రుల చివర్లో అంటే అక్టోబర్ 23న సీఎం క్యాంపు కార్యాలయం లో గృహప్రవేశం చేసి 24 వ తేదీనుంచి అక్కడి నుంచే పరిపాలన చేస్తారని కూడా చెప్పారు. దీంతో ఇక దసరాకు అమరావతి నుంచి విశాఖపట్నంకు సీఎం షిఫ్ట్ అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. తాజా పరిస్థితులతో సీఎం విశాఖ నుంచి పాలన చేయడం మరింత ఆలస్యం అవుతుందని తెలిసింది. అమరావతి నుంచి విశాఖకు షిఫ్టింగ్ దసరాకు లేనట్లే అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసాయి. కొన్ని కారణాలతో వాయిదా తప్పడం లేదని చెబుతున్నాయి.విజయవాడ, అక్టోబర్ 14: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంకు మాకం మార్చడం ఆలస్యం కానుంది. విజయదశమికి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తారని.. అక్కడి నుంచే పాలన చేస్తారని గతంలో వైసీపీ నేతలు ప్రకటించారు.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. ముఖ్యమంత్రి విశాఖ రాకకోసం వికేంద్రీకరణ జేఏసీ కూడా విశాఖపట్నంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేయాలని సమావేశం కూడా పెట్టుకుంది. మూడు ప్రాంతాల అభివృద్ది మా లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. ఇక విశాఖపట్నంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసి అక్కడి నుంచే సమీక్షలు కూడా చేయడం ద్వారా సమగ్రాభివృద్ది లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినట్లు అవుతుందని కూడా భావించారు. ఇక వైఎస్సార్ సీపీలో ఉన్న వైవీ సుబ్బారెడ్డి వంటి ముఖ్య నేతలు కూడా సీఎం విశాఖకు షిఫ్ట్ అవుతున్నారని చెప్పారు…దీంతో దసరా శరన్నవరాత్రుల చివర్లో అంటే అక్టోబర్ 23న సీఎం క్యాంపు కార్యాలయం లో గృహప్రవేశం చేసి 24 వ తేదీనుంచి అక్కడి నుంచే పరిపాలన చేస్తారని కూడా చెప్పారు. దీంతో ఇక దసరాకు అమరావతి నుంచి విశాఖపట్నంకు సీఎం షిఫ్ట్ అవుతారని జోరుగా ప్రచారం జరిగింది. తాజా పరిస్థితులతో సీఎం విశాఖ నుంచి పాలన చేయడం మరింత ఆలస్యం అవుతుందని తెలిసింది. అమరావతి నుంచి విశాఖకు షిఫ్టింగ్ దసరాకు లేనట్లే అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేసాయి. కొన్ని కారణాలతో వాయిదా తప్పడం లేదని చెబుతున్నాయి.విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్దిపై సీఎం జగన్ ఫోకస్..
ఉత్తరాంధ్ర ప్రాంతం బాగా వెనుకబడి ఉందని.. ఆ ప్రాంతం అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవల్సి ఉందని ప్రభుత్వం చెబుతుంది. విశాఖ షిఫ్టింగ్ కు సంబంధించి జారీ చేసిన జీవోల్లో సైతం ఇదే అంశాన్ని పొందుపరిచింది ప్రభుత్వం. ఆంధ్రప్ర దేశ్ పునర్వవస్థీకరణ చట్టంలో కూడా వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారని.. అందుకే విశాఖలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులు బస చేసి సమీక్షలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు సీఎం జగన్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నట్లు చెబుతున్నారు.