Successful Double Lung Transplant On Paraquat Poisoning Patient At Secunderabad Yashoda Hospitals
డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. పాయిజన్ తాగిన 23 ఏళ్ల యువకుడికి పునర్జన్మ
రోహిత్‌కు తొలుత మెకానికల్ వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. తర్వాత అదనపు కార్పోరల్ సపోర్ట్ (ECMO)పై ట్రీట్మెంట్ చేశారు. అతను 15 రోజులకు పైగా ఎక్మో పై ఉన్నా ఎలాంటి బెటర్మెంట్ లేదు. దీంతో ఊపిరితిత్తుల మార్పిడికి వైద్యులు ప్రణాళిక చేసి పేషంట్‌తో పాటు కుటుంబ సభ్యుల కన్సెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత…ఒకేసారి రెండు ఊపిరితిత్తుల మార్పిడి (కంబైన్డ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్) సర్జరీని విజయవంతంగా నిర్వహించి సరికొత్త చరిత్ర సృష్టించారు యశోద ఆస్పత్రి డాక్టర్లు. మహబూబాబాద్ జిల్లా ముర్రాయిగూడెంకు చెందిన 23 ఏళ్ల రోహిత్ గత నెల వ్యక్తిగత కారణాలతో పారాక్వాట్ గడ్డి మందు తాగారు. కలుపు, గడ్డి నియంత్రణకు ఉపయోగించే “పారాక్వాట్” అనే పురుగు మందు చాలా డేంజర్. దీనిని తాగిన రోహిత్ ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. పారాక్వాట్ విషకణాలు చురుకుగా ఊపిరితిత్తులను చేరడంతో ఫలితంగా కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసీస్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ వైఫల్యంలో చివరి దశలో మరణానికి దారితీస్తుంది. ఇలా ప్రాణాపాయ స్థితిలో రోహిత్ యశోద ఆస్పత్రిలో చేరారు.రోహిత్‌కు తొలుత మెకానికల్ వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. తర్వాత అదనపు కార్పోరల్ సపోర్ట్ (ECMO)పై ట్రీట్మెంట్ చేశారు. అతను 15 రోజులకు పైగా ఎక్మో పై ఉన్నా ఎలాంటి బెటర్మెంట్ లేదు. దీంతో ఊపిరితిత్తుల మార్పిడికి వైద్యులు ప్రణాళిక చేసి పేషంట్‌తో పాటు కుటుంబ సభ్యుల కన్సెంట్ తీసుకున్నారు. రాష్ట్రంలోని “జీవన్ దాన్” సంస్థ అవయవ దానం విభాగం ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన రోగి (దాత) నుండి సేకరించిన ఊపిరితిత్తులను రోహిత్ కు అమర్చారు.
ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితులలో ఒక పేషెంట్‌కు ఊపిరితిత్తుల మార్పిడి ప్రపంచంలోని కొన్ని కేంద్రాలలో మాత్రమే జరిగింది. ఇలాంటి పరిస్థితులలో ఊపిరితిత్తుల మార్పిడి భారతదేశంలో ఇదే తొలిసారి. ఊపిరితిత్తుల మార్పిడి జరిగిన కేసులు ప్రపంచవ్యాప్తంగా 4 మాత్రమే ఉన్నాయని, అందులో ఎక్కువ కాలం జీవించి ఉన్న కేసు కూడా ఇదే మొట్టమొదటిదని యశోద వైద్యులు తెలిపారు. ఈ విజయవంతమైన సర్జరీతో భారత వైద్యరంగం-ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ రంగంలో చరిత్ర సృష్టించడం మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణంఅని యశోద హాస్పిటల్స్ డైరెక్టర్, డాక్టర్ పవస్ గోరుకంటి తెలిపారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అవయవమార్పిడి ఆపరేషన్ల (ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్స్) తో దేశంలోనే ముందున్న యశోద హాస్పిటల్స్ ఇపుడు విషం తాగిన యువకునికి ఒకేసారి రెండు ఊపిరితిత్తుల మార్పిడి (కంబైన్డ్ లంగ్ ట్లాప్స్ ప్లాంటేషస్) సర్జరీని విజయవంతంగా నిర్వహించి సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలిపారు.సికింద్రాబాద్ యశోద హాస్పిటల్, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వైద్య నిపుణులు డాక్టర్. హరికిషన్ గోనుగుంట్ల, థొరాసిక్ & లంగ్ ట్రాన్స్ ప్లాంట్ సర్జస్ డాక్టర్. కె. ఆర్. బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్. మంజునాథ్ బాలే, డాక్టర్ చేతస్, డాక్టర్. శ్రీచరణ్, డాక్టర్. విమి వర్గీస్‌తో కూడిన వైద్య బృందం ఆరు గంటల ఆపరేషన్ తరువాత రోహిత్‌కు విజయవంతంగా “లంగ్ ట్రాన్స్ ప్లాంటేషన్” సర్జరీ చేసినట్లు తెలిపారు. ట్రాన్స్ ప్లాంటేషన్ తర్వాత 24 గంటలకు వెంటిలేటర్‌పై, రెండు వారాలు ICU లో ఉన్న రోహిత్ వేగంగా కోలుకోవడంతో నార్మల్ రూమ్‌కి షిఫ్ట్ చేశారు. రోహిత్ 15 రోజుల తర్వాత పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు యశోద వైద్యులు తెలిపారు.