NTPC Recruitment: ఇంజనీరింగ్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం..
నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 495 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా అక్టోబర్ 20వ తేదీని నిర్ణయించారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో..కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్లో భాగంగా ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 495 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైనింగ్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా అక్టోబర్ 20వ తేదీని నిర్ణయించారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.
కనీసం 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గేట్-2023 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ తదితరాలు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకును అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు. ఎంపికైన అభ్యర్థులకు జీతంగా నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా అక్టోబర్ 20ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు, దరఖాస్తుల స్వీకరణ కోసం అధికారిక వెబ్సైట్ను క్లిక్ చేయండి.