Coffee Weight Loss: రోజూ ఎక్స్ట్రా ఒక కప్పు కాఫీ తాగితే.. బరువు తగ్గుతారట.. డోంట్ మిస్ ఇట్!
కాఫీ ఇది లేదనిదే కొంత మందికి రోజు మొదలవుదు. ఉదయం ఓ కప్పు.. సాయంత్రం ఒక కప్పుడు పడితే కానీ మైండ్, మూడ్ సెట్ కాదు. అంతే కాదండో ఒక్క కప్పు కాఫీ తాగడం వల్ల మూడ్ మారడమే కాకుండా.. బాడీ, మైండ్ రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి నుంచి కూడా దూరం అవుతాం. బ్రెయిన్ యాక్టీవ్ అవుతుంది. అందుకే చాలా మంది కాఫీని ఇష్ట పడతారు. మూడ్ మూర్చే మంచి డ్రింక్ ఏదంటే కాఫీ అని చెప్పవచ్చు. భారత దేశంలో కాఫీ తాగే ప్రియులు ఎక్కువే. అయితే ఏదైనా మితంగా..కాఫీ ఇది లేదనిదే కొంత మందికి రోజు మొదలవుదు. ఉదయం ఓ కప్పు.. సాయంత్రం ఒక కప్పుడు పడితే కానీ మైండ్, మూడ్ సెట్ కాదు. అంతే కాదండో ఒక్క కప్పు కాఫీ తాగడం వల్ల మూడ్ మారడమే కాకుండా.. బాడీ, మైండ్ రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి నుంచి కూడా దూరం అవుతాం. బ్రెయిన్ యాక్టీవ్ అవుతుంది. అందుకే చాలా మంది కాఫీని ఇష్ట పడతారు. మూడ్ మూర్చే మంచి డ్రింక్ ఏదంటే కాఫీ అని చెప్పవచ్చు. భారత దేశంలో కాఫీ తాగే ప్రియులు ఎక్కువే. అయితే ఏదైనా మితంగా తీసుకుంటేనే అమృతం. లేదంటే అదే విషంగా మారి మనపై ఎటాక్ మొదలు పెడుతుంది. కాబట్టి రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం మంచిదే అని ఆరోగ్య నిపుణులు సైతం వెల్లడించారు. అతిగా కాఫీ తాగితే.. నిద్ర లేమి సమస్యలే కాకుండా ఆందోళన కూడా పెరుతుంది. దీంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. కానీ ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం రోజూ ఒక ఎక్స్ ట్రా కప్పు కాఫీ తాగితే బరువు నియంత్రించడంలో హెల్ప్ అవుతుందని తేలింది. మరి దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నాలుగు సంవత్సరాల్లో 12 కేజీల బరువు తగ్గుతారు:
అక్టోబర్ 1వ తేదీన అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రిషిన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం ఈ విషయం వెల్లడైంది. ఒక వ్యక్తి ప్రతి రోజూ ఒక కప్పును కాఫీని తాగడం వల్ల నాలుగు సంవత్సరాల కాలంలో బరువు పెరిగే ప్రమాదం తగ్గుతుందని ఆ అధ్యయనం చెబుతోంది. అయితే కాఫీలో అధిక చక్కెర వేసుకుంటే మాత్రం దీంతో అంత ప్రయోజనం ఉండదని, కానీ క్రీమ్ లేదా నాన్ డైరీ కాఫీ వైట్ నరీని జోడించడం వల్ల బరువుపై ప్రభావం చూపదని నివేదికలో పేర్కొంది. కాఫీలో చక్కెర లేని షుగర్, క్రీమ్స్ తక్కువగా తీసుకునే వారిలో పరిశోధనలు చేయగా.. నాలుగు సంవత్సరాల్లో 12 కేజీల వరకూ బరువు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదే ఒక స్పూన్ చక్కెర తీసుకున్న వారు.. నాలుగు సంవత్సరాల్లో 9 కిలోల బరువు తగ్గారని వెల్లడించారు.చక్కెర తక్కువగా ఉన్న క్రీమ్స్ వంటి వాటినే వాడాలి:
వేడిగా, తక్కువ కేలరీలు ఉన్న పానియాలు తీసుకోవడం వల్ల శరీర బరువు మెరుగు పడుతుందని నిపుణులు అంటున్నారు. అదే కాఫీలో చక్కెరను జోడించడం వల్ల.. బరువు తగ్గరు సరి కదా.. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంది. అదే చక్కెర తక్కువగా ఉన్న క్రీమ్స్, వైట్ నర్స్ వంటివి చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయని అధ్యయనంలో తెలిపారు.
క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితం ఉంటుంది:
అంతే కాకుండా బరువు తగ్గించుకోవాలనుకునే వారు కాఫీని క్రమం తప్పకుండా తాగితే.. ఈ సమస్య నుంచి దూరం అవ్వొచ్చు. ఎందుకంటే కాఫీ తాగితే ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. దీంతో ఇతర ఆహారాలను తక్కువగా తీసుకుంటాం. దీంతో బరువు తగ్గేందుకు ఛాన్స్ ఉంది. అంతే కాకుండా కాఫీ తాగడం వల్ల గుండె సమస్యలు, బీపీ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ ఆరోగ్యానికి మంచిదే కానీ.. అధికంగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.