Chanadra Babu: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీలో టీడీపీ ఆందోళనలు ఉదృతం.. సత్యమేవ జయతే అంటూ నిరసనలు
సత్యమేవ జయతే కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీకి అండగా నిలిచారన్నారు లోకేష్. వైసీపీ వైఖరిని నిరసనగా కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిచ్చామని ట్వీట్ చేశారాయన. చంద్రబాబు చైతన్యాన్ని నిర్బంధించడం ఎవరి తరం కాదన్నారు.ఏపీలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొవాలని పిలుపునిచ్చారు లోకేష్.చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ ఆందోళనలు ఉధృతం చేస్తోంది. కాంతితో క్రాంతి పేరిట మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు లోకేష్. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా ఏపీలో టీడీపీ ఆందోళనలను ఉదృతం చేస్తోంది. సత్యమేవ జయతే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు. మరోవైపు 20 రోజుల తరువాత నారా లోకేష్ ఢిల్లీ నుంచి రాజమండ్రికి చేరుకున్నారు . కుటుంబసభ్యులతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖాత్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఆరోపించారు లోకేష్. ముందు 3 వేల కోట్ల స్కామ్ అన్నారు. ఇప్పుడు 27 కోట్లు అంటున్నారు. వైసీసీ సర్కార్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైలుకు పంపారని విమర్శించారాయన. అక్రమ అరెస్టులతో చంద్రబాబును అడ్డుకోలేరన్నారు. పోరాటం ఆపొద్దు శాంతియుతంగా పోరాడండి అని చంద్రబాబు తమతో చెప్పారన్నారు లోకేష్….సత్యమేవ జయతే కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీకి అండగా నిలిచారన్నారు లోకేష్. వైసీపీ వైఖరిని నిరసనగా కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిచ్చామని ట్వీట్ చేశారాయన. చంద్రబాబు చైతన్యాన్ని నిర్బంధించడం ఎవరి తరం కాదన్నారు.ఏపీలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొవాలని పిలుపునిచ్చారు లోకేష్.శనివారం రాత్రి 7గంటలకు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి కొవ్వొత్తులు వెలిగిద్దాం అని ట్వీట్లో పేర్కొన్నారు లోకేష్. తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదన్నారు. నిరసనలు మరింత ఉదృతంచేస్తామన్నారాయన. పాదయాత్ర విషయంలో చర్చించి త్వరలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు లోకేష్.