Parineeti Chopra: పరిణితి చోప్రా భర్తకు షాక్ ఇచ్చిన కోర్టు.. వెంటనే ఇల్లు ఖాళీ చేయాలంటూ ఆదేశం
అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఏ ఇద్దరు ఇటీవలే పెళ్లిపీటలెక్కారు. అయితే వీరి వివాహం జరిగిన కొద్దిరోజులకే రాఘవ్ చద్దా కు కోర్టు షాక్ ఇచ్చింది. వారికి ఇచ్చిన ప్రభుత్వ బంగ్లాను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. అసలు ఆవివరాలేంటో ఇప్పుడు చూద్దాం.!ఆప్ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా , బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఏ ఇద్దరు ఇటీవలే పెళ్లిపీటలెక్కారు. అయితే వీరి వివాహం జరిగిన కొద్దిరోజులకే రాఘవ్ చద్దా కు కోర్టు షాక్ ఇచ్చింది. వారికి ఇచ్చిన ప్రభుత్వ బంగ్లాను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని కోర్టు ఆదేశించింది. అసలు ఆవివరాలేంటో ఇప్పుడు చూద్దాం.!
రాఘవ్ చద్దాకు జూలై 2022లో టైప్ 6 బంగ్లా ఇచ్చారు. ఈ సమయంలోరాఘవ్ చద్దా రాజ్యసభ ఛైర్మన్‌కు ప్రత్యేక విన్నపం చేశారు. టైప్ 7 బంగ్లా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో ఢిల్లీలోని పండారా రోడ్లో టైప్ 7 బంగ్లాను ఇచ్చారు. మార్చిలోనే ఈ బంగ్లాను ఖాళీ చేయాలని రాజ్యసభ కార్యదర్శి రాఘవ్ చద్దాను ఆదేశించారు. దీంతో పాటు మరో ఫ్లాట్‌ను వారికి కేటాయించారు. అయినా అతను ఖాళీ చేయలేదు.
సాధారణంగా టైప్-7 ప్రభుత్వ బంగ్లాను మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు లేదా గవర్నర్లకు ఇస్తారు. రాఘవ్ చద్దా ఎంపీ కావడంతో బంగ్లాను ఖాళీ చేయమని ఆర్డర్ ఇచ్చారు. దీనిపై ఢిల్లీలోని పాటియాలా కోర్టులో రాఘవ్ పిటీషన్ వేశారు. ఆ సమయంలో రాఘవ్ కు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఇక ఇప్పుడు ఢిల్లీ కోర్టులో దీని పై విచారణ జరిగింది
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, ‘రాఘవ్ కు ఇచ్చిన ప్రత్యేకాధికారాలను పూర్తిగా క్లెయిమ్ చేయలేదని. ఇచ్చిన బంగ్లాను రద్దు చేసిన తర్వాత కూడా అందులో కొనసాగే హక్కు మీకు లేదని అదనపు జిల్లా జడ్జి సుధాన్షు కౌశిక్ అన్నారు.