Sankranti Movie: 2024 సంక్రాంతికి నా సామీ రంగ.. ఇంకా పూనకాలు తెప్పించే సినిమాలే..
రెయిన్ బోలో ఏడు రంగులున్నట్లు.. సంక్రాంతికి కూడా అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి. అదేంటి.. రెయిన్ బోతో పండక్కి ఏంటి సంబంధం అనుకోవచ్చు కానీ అదే జరగబోతుందిప్పుడు. వచ్చే అరడజన్ సినిమాలు వేటికవే సపరేట్ జోనర్లో రాబోతున్నాయి. దాంతో ఉగాది కంటే ముందే సంక్రాంతికే షడ్రుచులు రుచి చూపించబోతున్నారు హీరోలు. మరి ఇంతకీ ఏంటా సినిమాలు..?చూస్తున్నారుగా.. ఇవన్నీ సంక్రాంతికి రాబోయే సినిమాలే.. 2024 పొంగల్ వార్ గురించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.మహేష్ బాబు గుంటూరు కారమే తీసుకోండి.. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్. ఇటు ఫ్యామిలీ నేపథ్యం ఉన్నా.. ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమా ఇది.ఇక విజయ్ దేవరకొండ ఖుషి తరహాలోనే మరోసారి కూల్ ఫ్యామిలీ సినిమాతో పండక్కి వస్తున్నారు. దిల్ రాజు నిర్మాత కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడు.రవితేజ కూడా పండక్కే వస్తున్నారు. ఆయనకు సంక్రాంతి చాలా స్పెషల్. 2024 పొంగల్ బరిలో ఈగల్‌ను దించుతున్నారు మాస్ రాజా. ఇది హాలీవుడ్ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్. సూర్య వర్సెస్ సూర్య ఫేమ్ కార్తిక్ ఘట్టమనేని దీనికి దర్శకుడు. ఇక హనుమాన్ కూడా పండక్కే రాబోతుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పూర్తిగా ఫిక్షనల్ ఫాంటసీ డ్రామా.నాగార్జున సైతం నా సామిరంగా అంటూ ఊర మాస్ సినిమాతో పండగ బరిలోకి దిగుతున్నారు. విజయ్ బిన్ని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఇక శివకార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా అయలాన్ కూడా పండక్కే రాబోతుంది. తాజాగా టీజర్ రిలీజ్ అయింది. మరోవైపు రజినీకాంత్ గెస్ట్ రోల్ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా లాల్ సలామ్ పొంగల్ బరిలో ఉంది. మొత్తానికి పండక్కి అన్ని జోనర్స్ సినిమాలు వస్తున్నాయి.