Hyderabad: కలకలంరేపుతోన్న వరుస చిన్నారుల కిడ్నాప్ వ్యవహారాలు.. పోలీసుల చాకచక్యంతో..ఐదేళ్ల బాలుడు శివ సాయితో కలిసి సికింద్రాబాద్ స్టేషన్ లో ఉదయం 5:30 కు ట్రైన్ దిగాడు. సాయంత్రం 4:30కు లోకేష్ తన కుమారుడుని బ్యాగుతోపాటు ప్లాట్ఫారం నెంబర్ వన్ దగ్గర నుంచి వెళ్ళాడు. అయితే తిరిగి వచ్చి చూసే లోపు బాలుడు కనిపించలేదు. తన కుమారుడు కనిపించడం లేదంటూ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి దుర్గేష్. రైల్వే స్టేషన్లో ఉన్న సిసిటీవీ కొటేషన్ పరిశీలించగా గుర్తుతెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు….
హైదరాబాదులో వరుసగా చిన్నారుల మిస్సింగ్ లు కలకలం సృష్టిస్తున్నాయి. శనివారం ఒకేరోజు ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోయిన ఘటనలు చోటుచేస్తున్నాయి. ఇందులో ఒక ఘటనలో బాలుడు కిడ్నాప్ కాగా మరో ఘటనలో బాలుడు మిస్ అయ్యాడు.. రెండు వేరు వేరు ఘటనల్లో ఇద్దరూ ఐదు సంవత్సరాల లోపు బాలురు మిస్సయ్యారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 5ఏళ్ళ బాలుడు కిడ్నాప్ కి గురయ్యాడు.. సికింద్రాబాద్ స్టేషన్ లో 28న తిరుపతి నుంచి తిరిగి హైదరాబాద్ కి చేరుకున్నాడు దుర్గేష్.ఇతను ఐదేళ్ల బాలుడు శివ సాయితో కలిసి సికింద్రాబాద్ స్టేషన్ లో ఉదయం 5:30 కు ట్రైన్ దిగాడు. సాయంత్రం 4:30కు లోకేష్ తన కుమారుడుని బ్యాగుతోపాటు ప్లాట్ఫారం నెంబర్ వన్ దగ్గర నుంచి వెళ్ళాడు. అయితే తిరిగి వచ్చి చూసే లోపు బాలుడు కనిపించలేదు. తన కుమారుడు కనిపించడం లేదంటూ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి దుర్గేష్. రైల్వే స్టేషన్లో ఉన్న సిసిటీవీ కొటేషన్ పరిశీలించగా గుర్తుతెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు గుర్తించారు.
సిసి కెమెరాల ద్వారా దర్యాప్తు చేసిన రైల్వే పోలీసులు బాబును హైటెక్ సిటీ దగ్గర గుర్తించారు. కిడ్నాప్ ప్రయత్నించిన ఇద్దరు దంపతులను రైల్వే పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మాదాపూర్ పోలీసుల సహకారంతో బాబును సురక్షితంగా కాపాడారు రైల్వే పోలీసులు. మాదాపూర్ హైటెక్ సిటీ వద్ద బాబును ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే సీసీ కెమెరాలు ద్వారా కిడ్నాప్ ఘటనను చేదించారుమైలార్ దేవ్ పల్లిలో మరో బాలుడు మిస్సింగ్…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాప్ కి గురైన బాలుడి కథ సుఖాంతం కాగానే మైలార్దేవ్ పల్లిలో మరో బాలుడు కనిపించకుండా పోయాడు.ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. ఫలక్నామ మైలార్ దేవుపల్లి మధ్య నివాసం ఉంటున్న బాలుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. తమ కుమారుడు ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు అంటూ మొదట ఫలక్ నమ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి..అయితే ఈ లిమిట్స్ మైలార్ దేవ్ పల్లి కి వస్తుందంటూ చెప్పడంతో అక్కడికి వెళ్లి తండ్రి ఫిర్యాదు చేశాడు..కేస్ నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం 5 బృందాలను ఏర్పాటు చేశారు.. బాలుడు సీసీ కెమెరాల్లో ఒక్కడిగానే కనిపిస్తున్నాడు…ఇది కిడ్నాప్ కాదంటూ పోలీసులు చెబుతున్నారు…బాలుడు మిస్స్ అయ్యాడని, ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
కొద్ది రోజుల ముందు నిలోఫర్ లో బాలుడి కిడ్నాప్..
ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితమే నీలోఫర్ హాస్పిటల్లో మరో బాలుడు కిడ్నాప్ కి గురయ్యాడు. నిలోఫర్ హాస్పిటల్ కి వచ్చిన దంపతులే బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఇలా తరచూ చిన్నారుల కిడ్నాప్ ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇన్ని లక్షల సీసీ కెమెరాలు ఉండటంతో గంటల వ్యవధిలోనే కిడ్నాప్ ఘటనలను పోలీసులు చేదిస్తునారు…ఐతే కిడ్నాప్ చేస్తున్న వారికి బెగ్గింగ్ మాఫియా తో సంబంధాలు ఉన్నాయని పలు అనుమానాలు వ్యక్తమ్ అవుతున్నాయి..ఇటీవల బెగ్గింగ్ మాఫియాను పూర్తిగా కట్టడి చేయడంతో వారు పక్క దారి పడుతున్నారని సమాచారం.