Hari Teja: భర్తతో విడాకులు తీసుకోనుందంటూ పుకార్లు.. బిగ్‌బాస్ ఫేమ్ హరితేజ రియాక్షన్ ఏంటంటే?
లేటెస్ట్గా చిరంజీవి భోళాశంకర్లోనూ తళుక్కున మెరిసిందీ అందాల తార. తన మాటల గారడీతో మెప్పించే హరితేజ టాలీవుడ్ తెరపై మరో సూర్యకాంతంగా పేరుతెచ్చుకున్నారు హరితేజ. సినిమాల సంగతి పక్కన పెడితే.. 2015లో బెంగళూరుకు చెందిన దీపక్ అనే వ్యక్తిని పెళ్లాడిందీ అందాల తార. వీరికి 2021లో భూమి అనే కుమార్తె జన్మించింది. అమ్మయిన తర్వాత కొద్దిగా బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత చాలా స్లిమ్‌గా మారిపోయింది.నటి హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె నటిగా సీరియల్స్, సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా నితిన్, సమంత నటించిన అఆ సినిమాలో హరితేజ పోషించిన మంగమ్మ పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. కెరీర్ ఆరంభంలో మనసు మమత, రక్త సంబంధం, అభిషేకం, కన్యాదానం, తాళికట్టు శుభవేళ, శివరంజని వంటి ధారావాహికల్లో నటించింది. అలాగే సిక్త్స్ సెన్స్, పటాస్, పండగ చేస్కో, సూపర్ సింగర్ వంటి టీవీ షోల్లోనూ సందడి చేసింది. ఇ క బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకుది. ఇదే క్రేజ్‌తో అత్తారింటికి దారేది, నేనొక్కడినే, దువ్వాడ జగన్నాథం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్, కృష్ణార్జున యుద్ధం, సమ్మోహనం, ఎఫ్ 2, రాజుగారి గది 3, హిట్, జాంబిరెడ్డి, అరవింద సమేత వీర రాఘవ, ప్రతిరోజు పండగే తదితర సూపర్‌హిట్ సినిమాల్లో నటించింది. లేటెస్ట్గా చిరంజీవి భోళాశంకర్లోనూ తళుక్కున మెరిసింది. తన మాటల గారడీతో మెప్పించే హరితేజ టాలీవుడ్ తెరపై మరో సూర్యకాంతంగా పేరుతెచ్చుకున్నారు హరితేజ. సినిమాల సంగతి పక్కన పెడితే.. 2015లో బెంగళూరుకు చెందిన దీపక్ అనే వ్యక్తిని పెళ్లాడిందీ అందాల తార. వీరికి 2021లో భూమి అనే కుమార్తె జన్మించింది. అమ్మయిన తర్వాత కొద్దిగా బరువు పెరిగిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత చాలా స్లిమ్‌గా మారిపోయింది.సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే హరితేజ తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆస్ట్రేలియాలో విహరిస్తోందీ అందాల తార. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత నెటిజన్లతో ముచ్చటించింది హరితేజ. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ సందర్భంగా ఒకరు ‘ మీ భర్త దీపక్‌తో విడాకులు తీసుకున్నారా? అని హరితేజను అడిగాడు. దీనికి స్పందించిన ఆమె.. ‘నాలుగు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే మనిషిని కూడా చంపేసేలా ఉన్నారే’ అంటూ వెంటనే తన భర్త దీపక్‌తో ఉన్నఫొటోను షేర్ చేసింది. తద్వారా విడాకులపై వస్తోన్న పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టింది. ప్రస్తుతం హరితేజ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా త్వరలోనే ఆమె మరికొన్ని సినిమాల్లో నటించే అవకాశముంది.