Chandramukhi 2: కంగనా చంద్రముఖి2 మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే..
జోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికి కూడా చంద్రముఖి అంటే జోతికానే గుర్తొస్తుంది. అంతలా నటించి మెప్పించారు జోతిక. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరోగా దర్శకుడు, కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ నటించారు. అలాగే ఈ సినిమాలో చంద్రముఖి గా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో చంద్రముఖి2 సినిమా ఒకటి. దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించారు దర్శకుడు పీ వాసు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి సినిమాలో హీరోగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించారు. అలాగే ఆ సినిమాలో చంద్రముఖిగా జోతికా నటించి మెప్పించారు. జోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికి కూడా చంద్రముఖి అంటే జోతికానే గుర్తొస్తుంది. అంతలా నటించి మెప్పించారు జోతిక. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో హీరోగా దర్శకుడు, కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ నటించారు. అలాగే ఈ సినిమాలో చంద్రముఖి గా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించింది.రిలీజ్ కు ముందు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పై అంచనాలను పెంచేశాయి. కంగనా రనౌత్ చంద్రముఖి గా అద్భుతంగా నటించారు. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ మూవీకు రిలీజ్ కు ముందు భారీగానే థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చంద్రముఖి2 సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.10 కోట్లు షేర్ ను రాబట్టాలి. చంద్రముఖి2 సినిమా తెలుగు స్టేట్స్ లో ఎంత బిజినెస్ చేసిందంటే.. నైజాం 3.40 కోట్లు, సీడెడ్ 2.00 కోట్లు, ఆంధ్ర 4.00 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 9.40 కోట్ల బిజినెస్ చేసింది చంద్రముఖి 2. ఇక ఈ సినిమా తొలి రోజు రూ 7.5 కోట్లు వసూల్ చేసింది. రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
కంగనా రనౌత్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..