Vijay Deverakonda: విజయ్ దేవర కొండ సినిమానుంచి శ్రీలీల అవుట్.. ఆమె ప్లేస్‌లోకి ఆ స్టార్ హీరోయిన్అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు విజయ్. ఇక అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషన్ సినిమాలో నటించిన తర్వాత గీతగోవిందం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉండటంతో పాటు నటనతో ఆకట్టుకున్నారు. దాంతో స్క్రీన్ పై హిట్ పెయిర్ గా నిలిచారు. ఈ ఇద్దరు కలిసి ఆ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు.చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ ఇప్పుడు క్రేజీ హీరోగా ఎదిగారు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు విజయ్. ఇక అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషన్ సినిమాలో నటించిన తర్వాత గీతగోవిందం సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉండటంతో పాటు నటనతో ఆకట్టుకున్నారు. దాంతో స్క్రీన్ పై హిట్ పెయిర్ గా నిలిచారు. ఈ ఇద్దరు కలిసి ఆ సినిమా తర్వాత డియర్ కామ్రేడ్ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారని తెలుస్తోంది.లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కు మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కానీ విడుదల తర్వాత ఆ అంచనాలు అందుకోలేకపోయింది. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాలో సంగీతం హైలైట్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు విజయ్ తన 12వ సినిమాతో బిజీ కానున్నాడు.విజయ్ దేవరకొండ గౌతం తిన్నూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొనీమద్యే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన పూజాకార్యక్రమం జరిగింది. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశారు. శ్రీలీల పూజాకార్యక్రమంలోనూ పాల్గొంది. కానీ ఇప్పుడు ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ప్లేస్ లో రష్మిక మందన్నాను ఎంపిక చేశారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ 12వ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా ఎంపికైందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. దాంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.