Vastu Tips: మీ ఇంట్లో వాచ్ ఏ దిశలో ఉందో ఓసారి చూసుకోండి.. ఇక్కడ ఉంటే మాత్రం..అయితే కేవలం పెద్ద పెద్ద వస్తువులే కాదు గోడ గడియారం కూడా వాస్తు ప్రకారమే ఉండాలనే విషయం మీకు తెలుసా.? అవును నిజమే ఇంట్లో ఉండే వాచ్ కూడా సరైన దిశలో ఉండాలని వాస్తు చెబుతోంది. వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకునేందుకు మాత్రమే కాకుండా ఇంట్లో ఒక అలంకరణ వస్తువుగా మారిపోయింది. అట్రాక్టివ్‌గా కనిపించేందుకు గాను రకరకల డిజైన్స్‌లో ఉన్న వాచ్‌లను…ఇంట్లో ఉండే ప్రతీ వస్తువు వాస్తుపై ప్రభావం చూపుతుందని తెలిసిందే. అందుకే ఏ దిశలో ఏ నిర్మాణం ఉండాలో వాస్తు శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అదే విధంగా ఇంట్లోని వస్తువులు కూడా ఏ దిశలో ఉండాలనే విషయాలను కూడా వాస్తు శాస్త్రంలో వివరించారు. టీవీ, ఫ్రిడ్జ్, బీరువా, మంచం ఇలా ప్రతీ వస్తువు ఏ దిశలో ఉంటే ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే విషయాన్ని వాస్తు నిపుణులు చెబుతుంటారు.అయితే కేవలం పెద్ద పెద్ద వస్తువులే కాదు గోడ గడియారం కూడా వాస్తు ప్రకారమే ఉండాలనే విషయం మీకు తెలుసా.? అవును నిజమే ఇంట్లో ఉండే వాచ్ కూడా సరైన దిశలో ఉండాలని వాస్తు చెబుతోంది. వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకునేందుకు మాత్రమే కాకుండా ఇంట్లో ఒక అలంకరణ వస్తువుగా మారిపోయింది. అట్రాక్టివ్‌గా కనిపించేందుకు గాను రకరకల డిజైన్స్‌లో ఉన్న వాచ్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వాచ్‌ను ఇంట్లో సరైన దిశలో పెట్టకపోతే నష్టాలు తప్పవని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఇంట్లో వాచ్ ఏ దిశలో ఉండాలి.? ఏ దిశలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో గోడ గడియారం ఈశాన్య దిశలో ఉండడం ఉత్తమం. ఏ గదిలో ఉన్న వాచ్ అయినా సరే ఆ గదిలో ఈశాన్యం మూలన వాచ్ ఉండేలా చూసుకోవాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఒకవేళ ఈశాన్యంలో వాచ్ పెట్టుకునే అవకాశం లేకపోతే రెండో ప్రాధాన్యత ఉత్తర దిశకు ఇవ్వాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అదీ కూడా కుదరకపోతే తూర్పు దిశలో వాచ్ ఉండేలా చూసుకోవాలి. ఇవి కాకుండా మిగతా దిక్కులో వాచ్ పెట్టకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న వారిపై దుష్ప్రభావం చూపే అవకాశాలున్నాయని చెబుతున్నారు.ఇక ఇంట్లో గడియారం ఉందా అంటే ఉన్నట్లు కాకుండా అది నిత్యం నడిచేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో నడవని వాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకోకూడదు. ఇక ఈశాన్య దిశలో వాచ్ ఉంటే ఇంటి యజమానికి గౌరవం, కీర్తి, శ్రేయస్సు వంటివి లభిస్తాయి. ఉత్తర దిశలో గడియారం ఉంటే వ్యాపారాల్లో నష్టాలు, ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. తూర్పు దిశలో గడియారం ఉంటే కుటంబ సభ్యులు సంతోషంగా ఉంటారంటా.
ఈ దిశలో అసలే వద్దు..
ఇదిలా ఉంటే ఇంట్లో నైదుతి, దక్షిణం వైపు ఉండే గోడలకు ఎట్టి పరిస్థితుల్లో గడియారాలను ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇంటి తలుపు ఫ్రేమ్‌పై కూడా గడియారాన్ని పొరపాటున కూడా ఉంచకూడదు. డోర్ ఫ్రేమ్‌పై వాచ్‌లు ఉంచితే ఇంట్లో ఉన్న వారికి మానసిక ప్రశాంతత ఉండదని చెబుతున్నారు. అంతేకాదు ఇంట్లో ఏదో దుర్వార్త వినాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. చూశారుగా వాచ్ ఏ దిశలో ఉంటే, ఎలాంటి ఫలితాలు ఉన్నాయో. కాబట్టి గోడ గడియారాన్ని పెట్టే సమయంలో ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే మంచిది.