Chandrababu: సీఐడీ కస్టడీకి చంద్రబాబు.. ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు..
Chandrababu: ఏసీబీ కోర్టులోను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబా నాయుడుకు ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ అధికారుల వాదనలతో ఏకీభవించిన ఎసిబి కోర్టు ఈ ఆదేశాలువిజయవాడ, సెప్టెంబర్ 22: ఏసీబీ కోర్టులోను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబా నాయుడుకు ఎదురు దెబ్బ తగిలింది. చంద్రబాబును రెండు రోజుల పాటు కస్టడీకి ఇస్తు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ అధికారుల వాదనలతో ఏకీభవించిన ఎసిబి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును ఇచ్చింది. రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చింది. బుధవారం ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున అడీషనల్ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు చేశారు. ఇద్దరి వాదనలు విన్న ఏసీబీ కోర్టు తాజాగా చంద్రబాబును కష్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.
రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. సీఐడీ అధికారుల వాదనలతో ఏకీభవించింది కోర్టు. కస్టడీ తేదీలను తర్వాత వెల్లడిస్తామని తెలిపింది ఏసీబీ కోర్టు. విచారణ ఎక్కడ చేస్తారని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు.. జైలులోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. విచారణను ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపనున్నారు.సీఐడీ కస్టడీకి చంద్రబాబు, రెండు రోజులు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు రిమాండ్ రెండు రోజులు పొడిగించింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు.
చంద్రబాబును కస్టడీకి తీసుకున్నాక.. సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించే ఛాన్స్ ఉంది. క్యాబినెట్ అనుమతి లేకుండానే స్కిల్ డెవలప్మెంట్ స్కీం ఏర్పాటు చేశారా..? ప్రభుత్వ జీవోకు, అగ్రిమెంట్లో తేడా ఎందుకొచ్చింది? ప్రభుత్వం చెల్లించిన రూ.371 కోట్లలో రూ.240 కోట్లు షెల్ కంపెనీలకు వెళ్లిన విషయం మీకు తెలుసా? పైలెట్ ప్రాజెక్టు లేకండానే నిధులు విడుదల చేసి, షెల్ కంపెనీలకు దారి మళ్లించారా..? నిధుల కేటాయింపు అంతా మీ కనుసన్నలోనే జరిగిందా? లాంటి ప్రశ్నలను సంధించే అవకాశం ఉంది. దీంతో పాటు చంద్రబాబు విచారణ సమయంలో ఆడియో, వీడియోను కూడా రికార్డ్ చేస్తారు.