వామ్మో.. వర్షంలా కురిసిన పెట్రోల్..! నాలుగు వేల లీటర్లు నేలపాలు.. అక్కడంతా హై టెన్షన్..Visakhapatnam: ఆన్ లోడ్ చేస్తున్న ట్యాంకర్ ఒక్కసారిగా ముందుకు వెళ్లడంతో పైపు విరిగి వెదజల్లిన ఆ ఇంధనం పక్కనే ఉన్న మరో ట్యాంకర్ డ్రైవర్ ఆరీఫ్ (50) పై వర్షం లా పడింది. దీంతో ఆరిఫ్ తడిసి ముద్దయ్యాడు. అంతే ఒక్కసారిగా మరింత ఆందోళన పెరిగింది. ఆ సమయంలో ఏదైనా ఒక్క స్పార్క్ చెలరేగితే ఆరీఫ్ తో సహా.. మొత్తం టెర్మినల్ కే ఊహించనంత పెద్ద ముప్పే ఏర్పడేది. ప్రమాదాన్ని పసిగట్టిన ఫైర్ సేఫ్టీ అధికారులు మెయిన్ ట్యాంకు వద్ద ఎంఎస్ బ్లాక్ వాల్వు మూసేసారు. దాంతోవిశాఖపట్నం, సెప్టెంబర్22: అమ్మో..! ఒకటి రెండు కాదు.. ఏకంగా నాలుగు వేల లీటర్ల పెట్రోలు వృధాగా నీటి పాలైంది.పెట్రోల్ తో తడిచి ముద్దైన ట్రక్ డ్రైవర్ త్రుటిలో తప్పించుకున్నాడు. విశాఖ ఐఓసీ టెర్మినల్లో పెట్రోల్ ఫిల్లింగ్ పైప్ పగిలిపోయిన సంఘటనలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన విశాఖ సింధియా లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ) టెర్మినల్ లో చోటు చేసుకుంది. సరిగ్గా 10.30 గంటల సమయంలోనే లోడింగ్ కోసం ఆయిల్ ట్యాంకర్ టెర్మినల్ లోని ర్యాంపుపైకి వెళ్లింది. ఆ ర్యాంప్ 4 కేఎల్ ఛాంబర్ కు చెందింది. వెంటనే అన్లోడింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. సాధారణంగా ఛాంబర్ నిండిన తర్వాత వాల్వు కట్టేయాలి. అలా వాల్వు కట్టేలోపు అప్రమత్తంగా లేని ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని ఒక్కసారి గా ముందుకు పోనిచ్చాడు. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అక్కడే ఉన్న కార్మికులు ఎంత గట్టిగా అరచినా డ్రైవర్ కు వినపడలేదు. అలాగే ఒక్కసారిగా ముందుకు వెళ్ళాడు.దీంతో ట్యాంకర్లోకి మోటారు స్పిరిట్ సరఫరా చేస్తున్న పైపు పగిలిపోయింది. పెట్రోల్ ఒక్కసారిగా ఎగజిమ్మింది. దీంతో అందరిలో తీవ్ర అలజడి రేగింది. లక్షల లీటర్ల వ్యూహాత్మక పెట్రో నిల్వలు ఉన్న ప్రాంతం కావడం తో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందేమో ఆన్న ఆందోళన. దీంతో ఫైర్ ఫైటర్స్ కూడా సిద్దం అయాయి. ఒక్కసారిగా అలారం మోగింది. అంతా అలెర్ట్ అయ్యారు.
పెట్రోల్ పైన పడడంతో తడిచి ముద్దైన మరో ట్యాంకర్ డ్రైవర్దీంతో ట్యాంకర్లోకి మోటారు స్పిరిట్ సరఫరా చేస్తున్న పైపు పగిలిపోయింది. పెట్రోల్ ఒక్కసారిగా ఎగజిమ్మింది. దీంతో అందరిలో తీవ్ర అలజడి రేగింది. లక్షల లీటర్ల వ్యూహాత్మక పెట్రో నిల్వలు ఉన్న ప్రాంతం కావడం తో ఏదైనా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందేమో ఆన్న ఆందోళన. దీంతో ఫైర్ ఫైటర్స్ కూడా సిద్దం అయాయి. ఒక్కసారిగా అలారం మోగింది. అంతా అలెర్ట్ అయ్యారు.
పెట్రోల్ పైన పడడంతో తడిచి ముద్దైన మరో ట్యాంకర్ డ్రైవర్