UPI Payments: మీ ఫోన్లో తరచూ యూపీఐ పేమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) పేమెంట్స్ మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. షాపింగ్ మాల్స్, పెట్రోల్ పంపు నుంచి స్ట్రీట్ ఫుడ్ అవుట్లెట్ల వరకు మొబైల్ ఫోన్‌తో క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. UPI ద్వారా చెల్లింపులు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సార్లు బిల్లు చెల్లించడంలో అవరోధాలు ఏర్పడుతుంటాయి. క్యాబ్‌లో గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత లేదా రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత..యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) పేమెంట్స్ మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. షాపింగ్ మాల్స్, పెట్రోల్ పంపు నుంచి స్ట్రీట్ ఫుడ్ అవుట్లెట్ల వరకు మొబైల్ ఫోన్‌తో క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. UPI ద్వారా చెల్లింపులు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సార్లు బిల్లు చెల్లించడంలో అవరోధాలు ఏర్పడుతుంటాయి. క్యాబ్‌లో గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత లేదా రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాత బిల్లు చెల్లింపు సమయంలో ఒక్కోసారి ఫెయల్ అవుతుంటాయి. సమయానికి చేతిలో డబ్బు లేకపోవడం వల్ల బిల్లు ఎలా చెల్లించాలో తెలియక తికమకపడిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే..నిజానికి అనేక కారణాల వల్ల UPI చెల్లింపులు వైఫల్యం అవుతుంటాయి. UPI ID కరెక్ట్‌గా ఇవ్వకపోయినా.. బ్యాంక్ సర్వర్ డౌన్ అయినా, ఇంటర్నెట్ సరిగ్గా పని చేయకపోయినా, పిన్ నంబర్ తప్పుగా నమోదు చేసినా యూపీఐ చెల్లింపుల్లో అవరోధం ఏర్పడుతుంది.
రోజువారీ UPI చెల్లింపు పరిమితి తప్పనిసరిగా తెలుసుకోవాలి
చాలా బ్యాంకులు UPI లావాదేవీలపై కొన్ని పరిమితులను విధిస్తాయి. ఎన్పీసీఐ (NPCI) మార్గదర్శకాల ప్రకారం.. ఒక రోజుకి లక్ష రూపాయల కంటే ఎక్కువ బదిలీ చేయడానికి అనుమతి ఉండదు. రోజువారీ చెల్లింపుల విషయంలో యపీఐ లావాదేవీలు 10 సార్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకంటే ఎక్కువ లావాదేవీలు జరపాలంటే 24 గంటల తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. ఈలోపు డబ్బు పంపేందుకు ప్రయత్నిస్తే యూపీఐ పేమెంట్స్ జరగవు.ఒక యూపీఐ ఐడీతో బహుళ బ్యాంక్ అకౌంట్లను లింక్ చేయడం
UPI చెల్లింపు వైఫల్యానికి మరో కారణం బ్యాంకు సర్వర్లు. ఈ సమస్యను అధిగమించడానికి ఏకైక మార్గం ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను మీ యూపీఐ ఐడీతో లింక్ చేసుకోవాలి. దీని వల్ల ఒక బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు పంపడంలో సమస్య ఉంటే, వెంటనే మరొక ఖాతా నుంచి బదిలీ చేయడానికి అవకాశం ఉంటుంది.
రిసీవర్ వివరాలు సక్రమంగా ఉండాలి
మీరు డబ్బు పంపుతున్న వ్యక్తి బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్ సరిగ్గా నమోదు చెయ్యాలి. తప్పు అకౌంట్ నంబర్ లేదా IFSC కోడ్ ఇచ్చినట్లయితే యూపీఐ లావాదేవీల్లో వైఫల్యం తలెత్తుతుంది.
పాస్వర్డ్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయాలి
ఫోన్ పాస్వర్డ్లు, ATM పిన్ నెంబర్, ఇమెయిల్ వంటి ఇతర పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవడంలో సహజంగానే గందరగోళానికి అవకాశం ఉంటుంది. పాస్వర్డ్లు తరచుగా మర్చిపోతుంటే నోట్స్ రాసి పెట్టుకోవాలి. అయితే మీ పిన్ నంబర్లుఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకూడదు.