Drunk Man Calls Himself A Doctor And Does Treatment In A Sircilla Government Hospital
Telangana: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.. ఫుల్లుగా తాగాడు డాక్టర్ అయ్యాడు.. కట్ చేస్తే, ఆసుపత్రికి వెళ్లి..కొంచెం మద్యం తాగితే.. కొందరు ఊగిపోతూ రచ్చ రచ్చ చేస్తుంటారు. అలాంటిది.. ఓ వ్యక్తి పీకల దాకా మద్యం తాగాడు.. ఆ తర్వాత ఎం చేశాడు.. ఎందుకు చేశాడో అతనికే తెలీదు.. కట్ చేస్తే అప్పుడే సీన్ మొదలైంది.. ఫుల్లుగా తాగిన మైకంలో నేను పెద్ద డాక్టర్‌ను అంటూ హల్చల్ చేశాడు.. ఏమైనా రోగాలుంటే నాకు చెప్పండి ట్రీట్మెంట్ ఇస్తానంటూ ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.. ఆ తర్వాత రోగుల దగ్గరికి వెళ్లి.. ఎలా ఉన్నావు..? నీకేం బాధ వచ్చింది..కొంచెం మద్యం తాగితే.. కొందరు ఊగిపోతూ రచ్చ రచ్చ చేస్తుంటారు. అలాంటిది.. ఓ వ్యక్తి పీకల దాకా మద్యం తాగాడు.. ఆ తర్వాత ఎం చేశాడు.. ఎందుకు చేశాడో అతనికే తెలీదు.. కట్ చేస్తే అప్పుడే సీన్ మొదలైంది.. ఫుల్లుగా తాగిన మైకంలో నేను పెద్ద డాక్టర్‌ను అంటూ హల్చల్ చేశాడు.. ఏమైనా రోగాలుంటే నాకు చెప్పండి ట్రీట్మెంట్ ఇస్తానంటూ ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.. ఆ తర్వాత రోగుల దగ్గరికి వెళ్లి.. ఎలా ఉన్నావు..? నీకేం బాధ వచ్చింది.. నీ అనారోగ్య సమస్యకు ఇంజక్షన్ ఇస్తానంటూ రోగులతో గొడవ కూడా పెట్టుకున్నారు. మనోడి హాడావుడి.. హంగామా చూసి రోగులు కూడా నిజమేమోనని నమ్మబోయారు.. చివరకు అతని నోటి నుంచి మద్యం వాసన రావడం, రోగుల బంధువులకు అనుమానం రావడంతో వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వాళ్లు అక్కడికి చేరుకుని.. డ్రింకర్ హాడావుడి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డ్రింకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ కాసేపటికి మందు నషా దిగిన తర్వాత.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది.ఈ షాకింగ్ ఘటన సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఎనుగొండ వేణు అనే వ్యక్తి హల్చల్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ అంటూ చేశాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషంట్ల దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేస్తానంటూ చెప్పాడు.. రోగులు కూడా ముందు అతన్ని చూసి భయపడటంతో.. ఏం కాదు.. ట్రిట్మెంట్ ఇస్తానంటూ వారిని బెదిరించాడు. మరో రోగి దగ్గరరికి వెళ్లి చెయ్యిపట్టుకొని ఎం కాదు నీకు రోగం తగ్గిందని అంటూ కాసేపు డ్రామాలాడాడు. అదేవిధంగా మరి కొంతమంది రోగుల దగ్గరికి ఇదే తరహాలో కాసేపు ముచ్చటించాడు.
ఈ క్రమంలో ఆసుపత్రిలోని రోగుల బంధువులకు డ్రింకర్ వేణు తీరుపై అనుమానం రావడంతో అతన్ని నిలదీశారు. ఈ క్రమంలో వేణు పొంతన లేని సమాధానం చెబుతుండటంతో ఇక లాభం లేదని రోగుల బంధువులు డ్యూటీ నర్స్‌కు సమాచారం చేరవేశారు. షాకైన నర్సు అక్కడికి చేరుకుని.. ఇతడు డాక్టర్ కాదని రోగి బంధువులకు చెప్పారు.. ఆ తర్వాత వేణు తీరు గమనించి.. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు వేణును అదుపులోకి వివరాలు సేకరించారు. అనంతరం అతన్ని తీసుకొని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. ఈ క్రమంలో వేణు తన అమ్మ హాస్పిటల్లో ఉందని.. అందుకోసం ఆసుపత్రికి వచ్చానంటూ పోలీసులకు చెప్పాడు.. అతని మాటల్లో తేడా ఉండటంతో.. వేణు మద్యం తాగి ఇలా చేశాడని పోలీసులు నిర్ధారణకు వచ్చాడు. అంనతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. మరో సారి ఇలా చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వేణును హెచ్చరించారు.
కాగా.. ఈ ఘటన సిరిసిల్లలో సంచలనంగా మారింది. ఆసుపత్రిలో ఓ వ్యక్తి మద్యం తాగి హాడావుడి చేస్తుంటే.. సిబ్బంది ఏం చేస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.