Mind Control Technology: బాబోయ్ ఇదేం టెక్నాలజీ.. మెదడు చదివి డేటా చోరీ చేస్తున్న న్యూరో వెపన్స్! బాధితులు వీళ్లే..మైండ్ కంట్రోల్ టెక్నాలజీ గురించి మీకు తెలుసా… చాలా తక్కువ మందికి తెలుసు.. కానీ అమెరికాలో దీని బాధితులు ఎక్కువమందే ఉన్నారట.. పూర్వకాలం చేతబడి విద్య అనేది ఉండేది.. తాము ఎవరినైతే టార్గెట్ చేసేవారో.. ఆ వ్యక్తి తాలూకు వెంట్రుకలను తీసుకొని పిండి బొమ్మను తాయారు చేసి అందులోకి పంపి చంపాలనుకున్న వ్యక్తిని ఆవాహన చేసుకొని ఆ బొమ్మను హింసిస్తూ ఉంటె ఆ మనిషి హింసకు గురిఅవుతాడు అనేది కొందరి నమ్మకం.. అయితే..విజయవాడ, సెప్టెంబర్ 11: మైండ్ కంట్రోల్ టెక్నాలజీ గురించి మీకు తెలుసా… చాలా తక్కువ మందికి తెలుసు.. కానీ అమెరికాలో దీని బాధితులు ఎక్కువమందే ఉన్నారట.. పూర్వకాలం చేతబడి విద్య అనేది ఉండేది.. తాము ఎవరినైతే టార్గెట్ చేసేవారో.. ఆ వ్యక్తి తాలూకు వెంట్రుకలను తీసుకొని పిండి బొమ్మను తాయారు చేసి అందులోకి పంపి చంపాలనుకున్న వ్యక్తిని ఆవాహన చేసుకొని ఆ బొమ్మను హింసిస్తూ ఉంటె ఆ మనిషి హింసకు గురిఅవుతాడు అనేది కొందరి నమ్మకం.. అయితే మైండ్ కంట్రోల్ టెక్నాలజీ చేసేది కూడా ఇలాంటిదే.. ఎవరినైతే కంట్రోల్ చేయాలనుకుంటున్నారో వారిని టెక్నాలజీ ద్వారా తీసుకొని వారు ఏం ఆలోచిస్తున్నారో ఈ టెక్నాలజీ ద్వారా తెలుసుకుంటున్నారట.మానవ మెదడును కంట్రోల్ చేసే టెక్నాలజీ పరిశోధనలతో ప్రమాదం పొంచి ఉంటుందని సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎన్నారై తరుణ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవుల ఆలోచనలను చదివి మానవ మెదడులను ప్రభావితం చేసే టెక్నాలజినీ కొన్ని గుర్తు తెలియని సంస్థలు అభివృద్ధి చేసి మనుషులను గిన్ని పిగ్స్ వలె ఉపయోగించుకుంటున్నారని NRI రావి తరుణ్ ఆరోపించారు. అయితే.. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది వాస్తవమని అన్నారు తరుణ్. మనుషుల ఆలోచనలను చదివటం దగ్గర నుంచి మానవుల ఆలోచనలను దారి మళ్ళించే విధంగా పరిశోధనలు చేస్తూ గిన్ని పిగ్స్ గా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే వైజాగ్ లో ఓ వ్యక్తిని టార్గెట్ చేశారని దీంతో అతను ఆ భాదలు భరించలేక అమెరికా వదిలి వైజాగ్ వచ్చేశారని తెలిపారు. మూడు నెలల క్రితం హవానా సిండ్రోమ్ వివరాలు తెలపాలంటూ కర్ణాటక హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిందని అన్నారు.
ఉదాహరణకు ఏదైనా ప్యాంట్, షర్టు గురించి గూగుల్ లో వెతికితే వెంటనే దానికి సంబంధించిన వివరాలు మొత్తం మొబైల్లో ప్రత్యక్షమవుతాయని అంతేకాకుండా అనేక కంపెనీల నుంచి తమ ప్రోడక్ట్ కొనమంటూ మెసేజ్ లు వస్తాయని ఆ విషయాలు ఆయా కంపెనీలకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అంటే.. మన డీటెయిల్స్ ని మనం వెతికిన సంస్థ లేదా ఆ సాఫ్ట్వేర్ ఫలానా వ్యక్తి షర్టు, ప్యాంట్లు కావాలని అడుగుతున్నారని మిగిలిన కంపెనీలకు పంపిస్తాయని అన్నారు. అంటే మన వివరాలను అమ్మేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు తరుణ్.. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసిన సైంటిస్టులు బహిరంగంగా చేసిన పరిశోధనల పట్ల విచారణ వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 1953లో అమెరికా ఎంకే ఆల్ట్రా పేరుతో ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారని ఆ పరిశోధనల ఫలితమే ఈ న్యూరో వెపన్స్, ఎనర్జీ వెపన్స్ అని అన్నారు.
ఈ వెపన్స్ మానవ మెదల్లను ప్రభావితం చేస్తాయని తద్వారా ఆలోచనలను తెలుసుకొనటమే కాకుండా మనిషిలో అనేక రకమైన బాధలను కలిగిస్తాయని, దీనినే హావానా సిండ్రోం అంటారని చెప్తున్నారు.. హావాన సిండ్రోం బారిన పడిన వారిలో అనేకమంది ప్రఖ్యాతి చెందిన సైంటిస్టులు డాక్టర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారని వారిలో అమెరికాకు చెందిన ప్రముఖ రాజకీయవేత కమల్ హారిస్ ఉన్నారని, డాక్టర్ లెన్ బెర్, డాక్టర్ రాబర్ట్ డంకన్, డాక్టర్ కేథరీన్ హోర్టన్, డాక్టర్ జాన్ హాల్ ఉన్నరని అన్నారు. నిద్ర లేకపోవడం రిమోట్ థాట్ రీడింగ్ ప్రసారం, మసక దృష్టి, డ్రీమ్ మానిప్యులేషన్, మూడ్ మార్పు మైక్రోవేవ్ వాయిస్ టూ స్కల్ – మెదడులోకి ఎలక్ట్రానిక్‌గా బేసి శబ్దాల ప్రొజెక్షన్ చేస్తారని వివరించారు.
మైండ్ కంట్రోల్ టెక్నాలజీ అంటే ఏమిటి?
అంతేకాక.. మనుషులు మెదళ్లను కంట్రోల్ చేసి.. బ్యాంక్ పాస్ వర్డ్ రీడ్ చేయడం, మర్చిపోయాలా చేస్తారని అన్నారు. తక్షణమే ప్రభుత్వాలు కలుగజేసుకొని మానవ మెదడుపై పరిశోధనలకు అడ్డుకట్ట వేయాలని లేనిపక్షంలో భవిష్యత్తరాలకు తీరం నష్టమే జరగటమే కాకుండా కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మారే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి భారత ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన హవానా సిండ్రోంపై దృష్టి సారించాలని సాప్ట్ వేర్ ఉద్యోగి తరుణ్ కోరుతున్నారు..