Tollywood News: రజినీ సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రానా.. దివంగత నటి పాత్రలో తమన్నాజైలర్ బ్లాక్‌బస్టర్ తర్వాత అందరి దృష్టి రజినీకాంత్ నెక్ట్స్ సినిమాపై పడింది. ఇప్పటికే ఈయన జై భీం దర్శకుడు టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా కథ కూడా మెసేజ్ ఓరియెంటెడ్‌గానే ఉంటుందని తెలుస్తుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ సహా మరికొందరు స్టార్స్ నటించబోతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి రానా, శర్వానంద్ లాంటి పేర్లు వినిపించినా.. రానా దగ్గుబాటి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.Rajinikanth: జైలర్ బ్లాక్‌బస్టర్ తర్వాత అందరి దృష్టి రజినీకాంత్ నెక్ట్స్ సినిమాపై పడింది. ఇప్పటికే ఈయన జై భీం దర్శకుడు టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా కథ కూడా మెసేజ్ ఓరియెంటెడ్‌గానే ఉంటుందని తెలుస్తుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ సహా మరికొందరు స్టార్స్ నటించబోతున్నారు. ఇక టాలీవుడ్ నుంచి రానా, శర్వానంద్ లాంటి పేర్లు వినిపించినా.. రానా దగ్గుబాటి నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.Samantha: దాదాపు నెల రోజుల పాటు అమెరికాలో ఉండి మైయోసైటిస్‌కు చికిత్స చేయించుకున్నారు సమంత. ఖుషి సినిమా ప్రమోషన్స్ కూడా అక్కడే ఉండి చేసారు ఈమె. తాజాగా ఇండియాకు వచ్చేసారు సమంత. వచ్చీరాగానే హైదరాబాద్ కాకుండా ముంబైలోనే ఉన్నారు. అక్కడి మీడియా కంట పడ్డారు.. ఏడాది పాటు ఈ చికిత్స కొనసాగుతుందని తెలుస్తుంది.. అంటే మరికొన్ని రోజుల్లో మళ్లీ అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది.Akshay Kumar: బయోపిక్స్ చేయడంలో అందరికంటే ముందుండే హీరో అక్షయ్ కుమార్. తాజాగా మిషన్ రాణిగంజ్ పేరుతో ఒక సర్వైవర్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారీయన. ఇది 1989లో జరిగిన నిజ జీవిత ట్రాజెడీ ఆధారంగా తెరకెక్కుతుంది. గతంలో అక్షయ్‌తో రుస్తుం తీసిన టిను సురేష్ దేశాయ్ దీనికి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైంది. అక్టోబర్ 6న థియేటర్లలో రానుంది. 1993లో ఇదే నేపథ్యంలో బాలయ్య నిప్పు రవ్వ సినిమా వచ్చింది.Tamannaah Bhatia: తక్కువ సమయంలో ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ దివ్యభారతి. 1990స్ జనరేషన్‌కు ఆమె రేంజ్ తెలుస్తుంది. చాలా తక్కువ టైమ్‌లో అప్పటి స్టార్ హీరోలందరితోనూ నటించి అసలైన పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకుంటున్నారు దివ్య భారతి. అయితే 19 ఏళ్ల వయసులోనే 1993లో అనుమానాస్పద రీతిలో కన్నుమూసారీమే. ఈమె జీవితం ఆధారంగా బాంద్రా అనే సినిమా వస్తుంది. అందులో దివ్యభారతి పాత్రలో తమన్నా నటిస్తుందనే ప్రచారం జరుగుతుంది.Allari Naresh: ఘోస్ట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ మధ్యే నా సామిరంగా సినిమాను మొదలు పెట్టారు నాగార్జున. కొరియోగ్రఫర్ విజయ్ బిన్నీ దీనికి దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో అల్లరి నరేష్‌ను కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా నాగార్జునకు నరేష్ వీరాభిమాని. అందుకే తను ప్రస్తుతం హీరోగా నటిస్తున్న సినిమాను కూడా పక్కనబెట్టి నాగ్ సినిమాకు డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది.