Telangana: డబ్బుల కోసం పుట్టక ముందే బిడ్డను బేరం పెట్టిన తల్లి.. చిన్నారి కోసం ఇద్దరి మధ్య గొడవతో వెలుగులోకిఅంబేద్కర్ కాలనీకి చెందిన గొసంగి దేవి, భర్త ఇద్దరు పిల్లలతో ఉంటుంది. భర్త కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే దేవి గర్భం దాల్చగా బిడ్డను పోషించే స్తోమత లేకపోవడంతో పుట్టిన వెంటనే బిడ్డను అమ్మాలని భావించింది. ఇదే విషయాన్ని దుబ్బ ప్రాంతంలోని UPHC లో పనిచేసే సలుంకే జయ కి తెలిపింది.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన రెండు రోజుల బాబు ను విక్రయించేందుకు యత్నించింది. విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు నిందులను అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసిపి కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన గొసంగి దేవి, భర్త ఇద్దరు పిల్లలతో ఉంటుంది. భర్త కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే దేవి గర్భం దాల్చగా బిడ్డను పోషించే స్తోమత లేకపోవడంతో పుట్టిన వెంటనే బిడ్డను అమ్మాలని భావించింది. ఇదే విషయాన్ని దుబ్బ ప్రాంతంలోని UPHC లో పనిచేసే సలుంకే జయ కి తెలిపింది. డబ్బులకు ఆశపడిన జయ నాగారంకు చెందిన అమీనా బేగంకు, ఆటోనగర్ కు చెందిన షబానా బేగంలకు బిడ్డను అమ్మేందుకు బేరసారాలు మొదలుపెట్టింది. ఆడబిడ్డ పుడితే లక్ష రూపాయలు అని, మగబిడ్డ పుడితే లక్షన్నర రూపాయలని రేటు నిర్ణయించింది. అమీనా బేగం, షబానా బేగంల వద్ద దేవి రూ.5 వేల చొప్పున అడ్వాన్స్ తీసుకుంది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గోసంగి దేవి మగబిడ్డకు జన్మనివ్వడంతో డెలివరి ఖర్చు రూ.20 వేలు షబానా బేగం కట్టింది.ఈ నెల 3న సోమవారం సాయంత్రం అంబేద్కర్ కాలనీ చౌరస్తాలోని పాత థియేటర్ వద్ద గోసంగి దేవి, ఆశా వర్కర్ సలూరికే జయలు గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మూడవ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పసి కందును విక్రయించేందుకు యత్నించిన తల్లి గోసంగి దేవి, ఆశ వర్కర్ సలూరికే జయ, విక్రయించేందుకు ప్రయత్నించిన అమీనా బేగం, షబానా బేగంలను పోలీసులు అరెస్టు చేశారు. పసికందును ఐసిడిఎస్ సిబ్బందికి అప్పజెప్పి, నలుగురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఏసిపి కిరణ్ కుమార్ తెలిపారు. వారి నుంచి రెండు సెల్ ఫోన్లు, 20 వేల నగదును స్వాధీన పరుచుకున్నా మని చెప్పారు.