Mahesh Babu: షారుఖ్ ఖాన్ సినిమాపై మహేష్ ట్వీట్.. ఫ్యామిలీతో కలిసి చూసేందుకు వెయిటింగ్..కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. షారుఖ్, నయన్ కాంబోలో రాబోతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్తాయిలో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. చాలా సంవత్సరాల తర్వాత పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు ఖాన్. ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. దీంతో ది కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ ఖాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయన నటిస్తోన్న జవాన్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. షారుఖ్, నయన్ కాంబోలో రాబోతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్తాయిలో రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. హిందీతోపాటు తెలుగు, తమిళం భాషల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు షారుఖ్.ఇటీవలే తన కూతురు సుహానాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉంటే.. షారుఖ్ నటించిన జవాన్ చిత్రం కోసం పలువురు సౌత్ స్టార్సా్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా జవాన్ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం జవాన్ సినిమా సమయం వచ్చేసిందని.. షారుఖ్ ఖాన్ పవన్ మొత్తం వెండితెరపై కనబడుతోందని.. అన్ని మార్కెట్లలోనూ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇక మహేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. బాద్ షా చిత్రానికి మహేష్ అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ముందుగా పూజా హెగ్డే, శ్రీలీలను కథానాయికలుగా ఎంచుకున్నారు. కానీ అనుకోకుండా ఈ మూవీ నుంచి పూజా తప్పుకోవడంతో మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.