Andhra Pradesh: పార్ట్ టైం జాబ్ కోసం వెతుకుతున్నారా.. ఇలా చేస్తే మీ జేబులకు చిల్లేకృష్ణా జిల్లా వత్సవాయికి చెందిన ఓ యువకుడు ఇలానే మోసపోయి ఏకంగా లక్షలు పోగుట్టుకున్నాడు. టెలిగ్రామ్ లో పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన లింక్ ద్వారా సైబర్ నేరగాళ్ళను సంప్రదించాడు. అప్పడూ మొదలైంది అసలు ఆట. మొదటగా వందల్లో ఆదాయం వస్తుంది అంటూ నమ్మించి తర్వాత అతనితోనే పెట్టుబడులు పెట్టించి లక్షల్లో గుంజేశారు. పార్ట్ టైం జాబ్ పేరుతొ మొదట టాస్క్‌లు ఉంటాయని అన్నారు. ఇచ్చిన లింక్ ద్వారా లైక్‌లు కొడితే టాస్క్‌లు పూర్తయి దానికి కొంత అమౌంట్ కాస్తుందంటూ మొదట డబ్బులు వేశారు.కృష్ణా జిల్లా న్యూస్, ఆగస్టు 26: ఈ మధ్యకాలంలో పార్ట్ టైం జాబ్ పేరుతో అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి నుంచి ఏకంగా 23.74 లక్షల రూపాయలు కొట్టేసారు సైబర్ నేరగాళ్లు. పంపిన లింకులకు లైక్‌లు కొడితే చాలంటూ భారీగా అదాయం వస్తుందంటూ మభ్యపెట్టి ఆఖరికి అతనికే కుచ్చుటోపీ పెట్టారు. మొదటగా డబ్బులు వస్తున్నట్లు ఆశ చూపి తర్వాత అతని జేబుకు కన్నం వేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం పార్ట్ టైం జాబ్స్ కోసం వెతికే యువతే ఈ సైబర్ నేరగాళ్ల టార్గెర్. వారి మాయమాటలు నమ్మి వాళ్ల వలలో పడ్డారో ఇక అంతే సంగతులు. జాబ్ సంగతి ఏమో కానీ మీ అకౌంట్ మాత్రం ఖాళీ అవ్వటం మాత్రం ఖాయం. టెలిగ్రామ్ వాడుతున్న వారికీ ఈమధ్య పార్ట్ టైం జాబ్స్ అంటూ రకరకాల లింక్స్ వస్తున్నాయి. అందులోను జాబ్స్ లేక ఖాలిగా ఉన్న యువత అలాంటి లింక్స్ క్లిక్ చేసి ఇంకా మోసపోతున్నారు.తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా వత్సవాయికి చెందిన ఓ యువకుడు ఇలానే మోసపోయి ఏకంగా లక్షలు పోగుట్టుకున్నాడు. టెలిగ్రామ్ లో పార్ట్ టైం జాబ్ పేరుతో వచ్చిన లింక్ ద్వారా సైబర్ నేరగాళ్ళను సంప్రదించాడు. అప్పడూ మొదలైంది అసలు ఆట. మొదటగా వందల్లో ఆదాయం వస్తుంది అంటూ నమ్మించి తర్వాత అతనితోనే పెట్టుబడులు పెట్టించి లక్షల్లో గుంజేశారు. పార్ట్ టైం జాబ్ పేరుతొ మొదట టాస్క్‌లు ఉంటాయని అన్నారు. ఇచ్చిన లింక్ ద్వారా లైక్‌లు కొడితే టాస్క్‌లు పూర్తయి దానికి కొంత అమౌంట్ కాస్తుందంటూ మొదట డబ్బులు వేశారు. అలా మెల్లగా టాస్క్‌లు అప్ గ్రేడ్ అయ్యాయని చెబుతూ.. మీరు పెట్టుబడి పెడితే దానికి రెండింతలు ఆదాయం వస్తుందంటూ నమ్మించారు. అయితే అప్పటికే కొంత డబ్బు రావటంతో నిజమే అనుకుని ఆ యువకుడు వారి వలలో పడిపోయాడు.
చివరికి దఫాలవారిగా ఏకంగా 23 లక్షల రూపాయల వరకు కట్టేసాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాలకు ఆ డబ్బును లాగేసుకున్నారు సైబర్ నేరగాళ్లు. ఆఖరికి పెట్టిన డబ్బులకు రూపాయి రాకపోగా సొమ్ము పోయాయాని గ్రహించాడు ఆ యువకుడు. ఇక చేసేదేం లేక సైబర్ పోలీసులని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీలవల చాలామంది సైబర్ నేరగాళ్లు తాము పంపే యూట్యూబ్ వీడియోలకు లైక్‌లు కొట్టి డబ్బులు సంపాదిచ్చవని ఆశచూపి ఎంతోమందిని మోసం చేస్తున్నారు. చాలామంది లక్షల్లో తమ డబ్బును పొగొట్టుకున్నారు. కొంతమందైతే కోట్లు కూడా పోగొట్టుకున్నారు. ఇలాంటి విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఏదైన సమస్య వస్తే తమకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.