Gandeevadhari Arjuna Twitter Review: గాంఢీవ ధారి అర్జున్ ట్వి్ట్టర్ రివ్యూ.. వరుణ్ తేజ్ మరో హిట్ కొట్టాడా?ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించాయి. దీంతో రిలీజ్‌కు ముందే మెగా ప్రిన్స్ మూవీపై పాజిటివ్ ఫీల్ వచ్చింది. భారీ అంచనాలతో శుక్రవారం (ఆగస్టు 25) గాంఢీవ ధారి అర్జున థియేటర్లలోకి అడుగుపెట్టాడు. చాలా చోట్ల ఇప్పటికే షోస్ పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో గాంఢీవ ధారి అర్జున మూవీని చూసిన వారు తమ అభిప్రాయలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. మరి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మెగా మూవీ గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి.గని ఫ్లాప్‌తో డీలా పడ్డ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు ఫుల్ ప్యాక్ యాక్షన్ మూవీతో మన ముందుకు వచ్చాడు. అతను నటించిన తాజా చిత్రం గాంఢీవ ధారి అర్జున. డిఫరెంట్ టేకింగ్‌తో సినిమాలను తెరకెక్కించే ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెరకెక్కించాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య కథానాయిక. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను నిర్మించిన బీవీఎస్‌ఎసన్ ప్రసాద్ ఎస్వీసీసీ బ్యానర్‌పై గాంఢీవ ధారి అర్జున మూవీని రూపొందించారు. మిక్కీ జే మేయర్ స్వరాలు అందించాడు. ఈ సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించాయి. దీంతో రిలీజ్‌కు ముందే మెగా ప్రిన్స్ మూవీపై పాజిటివ్ ఫీల్ వచ్చింది. భారీ అంచనాలతో శుక్రవారం (ఆగస్టు 25) గాంఢీవ ధారి అర్జున థియేటర్లలోకి అడుగుపెట్టాడు. చాలా చోట్ల ఇప్పటికే షోస్ పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో గాంఢీవ ధారి అర్జున మూవీని చూసిన వారు తమ అభిప్రాయలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. మరి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన వరుణ్ తేజ్ మూవీ గురించి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి.
గాంఢీవధారి అర్జున ఫస్ట్ హాస్ ఎక్స్‌లెంట్‌గా ఉందంటున్నారు ఆడియెన్స్. స్టైలిష్ యాక్షన్ డ్రామా చాలా బాగుందని, టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయంటున్నారు. టైటిల్ ఇంట్రో, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందంటున్నారు. ఇక బీజీఎమ్ అయితే నెక్ట్స్ లెవెల్లో ఉందంటున్నారు. యాక్షన్ సీన్లు కూడా హైలెట్‌గా నిలిచాయయని, అయితే డైరెక్టర్ స్క్రీన్‌ప్లేపై మరింత దృష్టిపెట్టాల్సి ఉందంటున్నారు. మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది.. అయితే నేరేషన్ స్లోగా ఉందంటున్నారు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మరి గాంఢీవధారి అర్జున సినిమాపై నెటిజన్ల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి.