Vastu Tips For Money: ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అదృష్టం మీ సొంతం.. మొక్కను పెంచుకోవడానికి ఓ దిశ ఉందని తెలుసా..ఇంట్లో, ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కల విషయంలో కూడా కొన్ని వాస్తు నియమున్నాయి. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెంచుకునే కష్టాలు నష్టాలు తెస్తే.. మరికొన్ని మొక్కలు సుఖ సంతోషాలు, ఆర్ధిక ఇబ్బందుల ను తీస్తున్నాయని పేర్కొన్నాయి. అయితే ఇన్ డోర్ ప్లాంట్ అంటే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది మనీ ప్లాంట్.. అయితే మనీ ప్లాంట్ మాత్రమే కాదు క్రాసులా జాడే ప్లాంట్ కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడనికి ఓకే నిర్దిష్ట దిశ ఉంది. ఇండోర్ లేదా అవుట్డోర్ మొక్కలు ఇంటికి అందాన్ని మాత్రమే కాదు.. సుఖ సంపదలను తెస్తాయని విశ్వాసం. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంటి లోపల మనీ ప్లాంట్ పెట్టుకుంటారు. ఇది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఐశ్వర్యం మాత్రమే కాకుండా డబ్బు కూడా వస్తుందని నమ్మకం.అయితే మనీ ప్లాంట్ మాత్రమే కాదు వాస్తు శాస్త్రంలో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన మరో మొక్క కూడా ఉంది. ఈ మొక్క ఇంట్లో ఉంచితే సంపద పెరుగుతుంది. ఆ మొక్కే క్రాసులా జాడే ప్లాంట్. ఇది మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మొక్క మనీ ప్లాంట్ కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ మొక్క దాని కంటే ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుందని నమ్ముతారు. ఈ మొక్క డబ్బును ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లో ఈ మొక్కను నాటడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మొక్క లక్ష్మీదేవికి చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే, ఈ మొక్కను లక్ష్మీ నివాసం అని పిలుస్తారు. కాబట్టి ఈ మొక్క ఎవరి ఇంట్లో ఉందో వారిపై లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.వాస్తు ప్రకారం క్రాసులా ఉన్న ఇంటికి డబ్బు సమస్యలు ఉండవు. అలాగే రుణ సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఈ మొక్క పరిష్కారాన్ని ఇస్తుంది. దీనిని మనీ మాగ్నెట్ అని కూడా అంటారు. కనుక ఈ మొక్క ఇంట్లో ఎక్కువమంది పెంచుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను నాటడానికి సరైన దిశ కూడా ఉంది. ఈ మొక్కను ఎల్లప్పుడూ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఉంచాలి. ఇలా చేయడం వలన అనేక ప్రయోజనాలు లభిస్తాయి. లేదంటే సమస్యలు వస్తాయి. క్రాసులా మొక్క ఇంట్లో మాత్రమే కాదు.. ఆఫీసు వంటి ఇతర ప్రాంతాల్లో కూడా పెంచుకోవచ్చు. ఇలా చేయడం వలనా శుభం కలుగుతుంది.