CM KCR Medak tour on 22nd August to inaugurates collector office, police and BRS party Office in Medak city
CM KCR: బుధవారం కేసీఆర్ మెదక్ టూర్.. అక్కడి నుంచే రెండు కొత్త కార్యక్రమాల ప్రారంభంబుధవారం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు హరీష్ రావు దగ్గరుండి సమీక్షించారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి మెదక్‌కు చేరుకోనున్న సీఎం మెదక్‌లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా రోడ్డు మార్గంలో సీఎం మెదక్‌కు చేరుకోనున్నారు. గుమ్మడిదలలో సీఎంకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్పార్టీ కార్యాలయాన్ని…ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తొలి తర్వాత తొలిసారి ముఖ్య మంత్రి కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం సీఎం మెదక్ టూర్‌కి సంబంధించిన వివరాలను మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మెదక్ పర్యటనలో భాగంగా కేసీఆర్.. వికలాంగులు ఆసరా పెన్షన్ పెంపుతో పాటు టెకేదార్లు, ప్యాకర్స్‌కు పింఛన్లు ఇచ్చే కార్యక్రమంను ప్రారంభించనున్నారు.బుధవారం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు హరీష్ రావు దగ్గరుండి సమీక్షించారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి మెదక్‌కు చేరుకోనున్న సీఎం మెదక్‌లోని సమీకృత కలెక్టర్ కార్యాలయం, పోలీస్ కార్యాలయం, జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా రోడ్డు మార్గంలో సీఎం మెదక్‌కు చేరుకోనున్నారు. గుమ్మడిదలలో సీఎంకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఘన స్వాగతం పలకనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 1.20 నిమిషాలకు పోలీస్ కార్యాలయం ప్రారంభిస్తారు. అనంతరం 1.40 గంటలకు సమీకృత కలెక్టర్ సభను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు సీఎం బహిరంగ సభలో పాల్గొననున్నారు.
మెదక్ నుంచి ప్రగతి శంఖారావం: హరీష్ రావు
బుధవారం మెదక్ నుంచి సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని పూరిస్తారని తెలిపారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10కి పది స్థానాలు గెలిచి, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. అభ్యర్థుల ప్రకటన తమ గెలుపునకు, ధీమాకు నిదర్శనమన్నారు హరీష్. కేసీఆర్ వ్యూహం ఎవరూ ఊహించలేదని, విపక్షాలు ఆగమైపోయాయని హరీష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ డీలా పడిపోయిందన్న మంత్రి, కాంగ్రెస్ కామ్ అయిపోందంటూ ఎద్దేవ చేశారు. దేశవ్యాప్తంగా రైతులు కేసీఆర్ పథకాలను కావాలని కోరుతున్నారన్న హరీష్ రావు.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నాయన్నారు. బుధవారం మెదక్‌లో జరిగే సీఎం బహిరంగ సభకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున్న ప్రజలు హాజరుకావాలని మంత్రి హరీష్ రావు తెలిపారు.ఇదిలా ఉంటే కేసీఆర్ మెదక్ టూర్ ఇది వరకే నిర్ణయించారు. అయితే ఆ సమయంలో వర్షం కారణంగా వాయిదా వేశారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం సీఎం ఆగస్టు 19వ తేదీన మెదక్ జిల్లాలో పర్యటించాల్సి ఉండేది. కానీ ఆ సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కేసీర్ మెదక్ టూర్‌ను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.