Abortion case: Supreme Court Allows Termination Of Pregnancy, Overrules Gujarat High Court’s Order
Supreme Court of India: ఆ కేసులో ఆఘమేఘాలపై కదిలిన సుప్రీంకోర్టు.. సెలవు దినాల్లోనూ విచారణ.. ఎందుకో తెలుసా?
దేశంలో న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల భారంతో సత్వర న్యాయం అందించడం చాలా వరకు సాధ్యం కావడం లేదు. మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యే సెన్సేషనల్ కేసుల్లోనే కాస్తో కూస్తో వేగంగా న్యాయం అందుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టినప్పటికీ చాలా కేసులు నత్తనడకనే సాగుతున్నాయి. ఎన్నికల అక్రమాల కేసుల్లో న్యాయస్థానంలో విచారణ ముగిసే సమయానికి పదవీకాలం కూడా పూర్తయిపోతోంది. ఈ ఉపోద్ఖాతం ఎందుకు అంటే.. అంతటి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న న్యాయవ్యవస్థ ఒక కేసు విషయంలో పరుగులు తీసింది. ఆఘమేఘాలపై స్పందించి, విచారణ చేపట్టింది. 24 గంటల్లోగా నివేదిక తెప్పించుకుని..Justice Delayed is Justice Denied అన్న మాట న్యాయ ప్రక్రియలో మనకు తరచుగా వినిపిస్తూ ఉంటుంది. న్యాయాన్ని అందించడంలో జరిగే జాప్యం, న్యాయం అందకుండా చేయడమే అని దీనర్థం. దేశంలో న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల భారంతో సత్వర న్యాయం అందించడం చాలా వరకు సాధ్యం కావడం లేదు. మీడియాలో విస్తృతంగా ప్రసారమయ్యే సెన్సేషనల్ కేసుల్లోనే కాస్తో కూస్తో వేగంగా న్యాయం అందుతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టినప్పటికీ చాలా కేసులు నత్తనడకనే సాగుతున్నాయి. ఎన్నికల అక్రమాల కేసుల్లో న్యాయస్థానంలో విచారణ ముగిసే సమయానికి పదవీకాలం కూడా పూర్తయిపోతోంది. ఈ ఉపోద్ఖాతం ఎందుకు అంటే.. అంతటి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న న్యాయవ్యవస్థ ఒక కేసు విషయంలో పరుగులు తీసింది. ఆఘమేఘాలపై స్పందించి, విచారణ చేపట్టింది. 24 గంటల్లోగా నివేదిక తెప్పించుకుంది. మరో 24 గంటల్లోగా తీర్పునిచ్చి బాధితురాలికి న్యాయం అందించే ప్రయత్నం చేసింది. చాలా అరుదుగా మాత్రమే జరిగే ఇలాంటి ఘటనలు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని ఇంకా సజీవంగా ఉంచుతున్నాయి.సుప్రీంకోర్టు ఇంత వేగంగా స్పందించడానికి కారణం ఉంది. గర్భం దాల్చిన అత్యాచార బాధితురాలు గర్భస్రావానికి అనుమతి కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె తాను అత్యాచారం కారణంగా గర్భం దాల్చినట్టు గుర్తించేసరికే 24 వారాలు దాటాయి. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా 24 వారాల గర్భాన్ని తొలగించుకునే అవకాశం ఉంది. 24 వారాలు దాటిన తర్వాత గర్భాన్ని తొలగించాలంటే న్యాయస్థానం అనుమతి ఇవ్వాల్సిందే. ఈ పరిస్థితుల్లో బాధిత మహిళ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించింది.
చట్టం ఏం చెబుతోంది?
ఇండియన్ పీనల్ కోడ్ (IPC)లో సెక్షన్ 312 ప్రకారం దేశంలో ఒకప్పుడు అబార్షన్‌ను నేరపూరిత చర్యగా పరిగణించేవారు. 1960లలో ఏర్పడ్డ శాంతిలాల్ షా కమిటీ సిఫార్సుల మేరకు 1971లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ – 1971 అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఒక డాక్టర్ సలహాతో 12 వారాల లోపు గర్భంతో ఉన్న మహిళ అబార్షన్ చేయించుకోవచ్చు. 12 నుంచి 20 వారాల మధ్య గర్భం విషయంలో ఇద్దరు వైద్యులు పరిశీలించి సలహా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ దశలో చేసే అబార్షన్ ఆ మహిళ శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి. ఈ చట్టానికి కూడా కాలానుగుణంగా సవరణలు తోడయ్యాయి. 2021లో చేసిన సవరణల తర్వాత 20 వారాల లోపు గర్భాన్ని తొలగించడానికి ఒక డాక్టర్ సలహా సరిపోతుంది. 20 నుంచి 24 వారాల మధ్య గర్భాన్ని తొలగించాలంటే ఇద్దరు వైద్యుల సలహా తప్పనిసరి. 7 కేటగిరీల్లోని మహిళలకు మాత్రమే ఈ దశలో గర్భాన్ని తొలగించుకునే అవకాశం ఉంది. ఆ ప్రకారం..01. అత్యాచార బాధితులు గర్భం దాల్చినప్పుడు
- మైనర్లు గర్భం దాల్చిన సందర్భాలు
- గర్భస్థ సమయంలో భర్తను కోల్పోవడం లేదా మరొకరిని వివాహం చేసుకున్న మహిళలు
- మానసిక రుగ్మతతో బాధపడుతున్న మహిళలు గర్భం దాల్చినప్పుడు
- శారీరక వైకల్యంతో ఉన్న మహిళలకు
- గర్భస్థ శిశువు తీవ్ర వైకల్యంతో ఉన్న సందర్భంలో
- యుద్ధాలు, వైపరీత్యాల లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మహిళ గర్భాన్ని తొలగించాలని కోరుకున్నప్పుడు.. 20-24 వారాల మధ్య ఉన్న గర్భాన్ని తొలగించడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది.
సూపర్‌ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా మారిన సుప్రీం..
అత్యాచార బాధితురాలి గర్భం విషయంలో సుప్రీంకోర్టు శరవేగంగా స్పందించింది. తొలుత బాధితురాలు ఆగస్టు 7న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించగా.. మర్నాడే హైకోర్టు విచారణ చేపట్టింది. మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ పిటిషనర్ గర్భం, ఆరోగ్యం, గర్భాన్ని తొలగించే అవకాశాలపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. మెడికల్ కాలేజి వైద్యుల బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆగస్టు 10 నివేదిక సమర్పించింది. ఆ గర్భాన్ని తొలగించవచ్చంటూ మెడికల్ బోర్డు నివేదిక ఇచ్చినప్పటికీ హైకోర్టు తీర్పు ఇవ్వకుండా కేసు తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేసింది. ఆ రోజు కూడా తీర్పు ఇవ్వకపోవడంతో బాధితురాలి తరఫు న్యాయవాది ఆగస్టు 18న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆరోజు శుక్రవారం. రిజిస్ట్రార్ కోర్టులో న్యాయవాది కేసులోని అర్జెన్సీ గురించి ప్రస్తావించారు. ఆ రోజు రాత్రి గం. 9.30కు విషయం భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు చేరింది. కేసులోని తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న ఆయన వెంటనే జస్టిస్ బీవీ నాగరత్నను సంప్రదించి మర్నాడు శనివారం ప్రత్యేక విచారణ చేపట్టగలరా అని అడిగారు. అందుకామే అంగీకరించడంతో అప్పటికప్పుడు జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన బెంచ్‌ను ఏర్పాటు చేశారు.
శనివారం ఉదయం గం. 10.30కు స్పెషల్ బెంచ్ విచారణ చేపట్టింది. గుజరాత్ హైకోర్టు తీర్పు విషయంలో జాప్యం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కొత్తగా మరో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అంటే ఆదివారం సాయంత్రంలోగా నివేదిక సుప్రీంకోర్టుకు చేరాలి. సోమవారం మెడికల్ బోర్డు ఇచ్చిన నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, అప్పటికి 28 వారాల గర్భంతో ఉన్న బాధిత మహిళకు అబార్షన్ చేయవచ్చని సూచించింది.
ఆ నివేదిక ఆధారంగా తీర్పునిస్తూ 12 గంటల్లోగా గర్భాన్ని తొలగించాల్సిందిగా ఆదేశించింది. అయితే 26 వారాల గర్భాన్ని తొలగించే క్రమంలో శిశువు ప్రాణాలతో ఉంటే, ప్రభుత్వమే ఆ శిశువుకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించి, ఆ తర్వాత దత్తత తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం తీర్పును అంగీకరిస్తూ శిశువును ప్రభుత్వం దత్తత తీసుకుంటుందని తెలిపారు. గతంలో ఓ మైనర్ గర్భాన్ని తొలగించడానికి నిరాకరించిన సందర్భంలో బిడ్డ పుట్టిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వమే దత్తత తీసుకుందని గుర్తుచేశారు.