BRS Candidates: అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.. కారులో చోటు దక్కనివారు వీరే..Telangana Elections: ఎప్పటిలాగే ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్ధుల్ని ప్రకటించారు గులాబీ బాస్ కేసీఆర్. కేవలం నాలుగు స్థానాలకు మినహా మిగతా అన్ని సీట్లకు రేసు గుర్రాల్ని అనౌన్స్ చేశారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 8మందికి మాత్రం టిక్కెట్లు దక్కలేదు. స్టేషన్‌ఘన్‌పూర్, ఉప్పల్, వైరా, వేములవాడ, ఆసిఫాబాద్, ఖానాపూర్, బోథ్‌లో సిట్టింగులను ఛేంజ్చేసి కొత్త వాళ్లకు ఛాన్సిచ్చారు.భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏడుగురికి టిక్కెట్లు దక్కలేదు. స్టేషన్‌ఘన్‌పూర్, ఉప్పల్, వైరా, వేములవాడ, కామారెడ్డి, ఖానాపూర్, బోథ్‌లో సిట్టింగులను ఛేంజ్చేసి కొత్త వాళ్లకు ఛాన్సిచ్చారు కేసీఆర్. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్యను పక్కనబెట్టి… కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. ఉప్పల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డికి ఛాన్స్ దక్కలేదు. ప్రచారం జరిగినట్టుగా బండారు లక్ష్మారెడ్డికే టికెట్ కేటాయించారు కేసీఆర్. వైరాలో రాములునాయక్‌ను మార్చేసి మదన్లాల్క అవకాశం ఇచ్చారు.
ఇక, పౌరసత్వ వివాదం ఎదుర్కొంటున్న వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు ఈసారి నో చెప్పారు కేసీఆర్. చెన్నమనేని ప్లేస్‌లో చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు ఛాన్స్ దక్కింది. ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం ఖానాపూర్‌లో రేఖానాయక్‌ను మార్చేసి జాన్సన్ నాయక్‌కి అవకాశం ఇచ్చారు. మరో ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం బోథ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు షాకిచ్చారు కేసీఆర్.
అక్కడ అనిల్ జాదవ్‌కు టికెట్ కేటాయించారు. ఇక, కామారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు షాకిచ్చిన గులాబీ బాస్… అక్కడ్నుంచి స్వయంగా ఆయనే బరిలోకి దిగుతున్నారు. ఇంకో ఎస్టీ నియోజకవర్గం ఆసిఫాబాద్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు కూడా టికెట్ దక్కలేదు, ఇక్కడ కోవా లక్ష్మికి ఛాన్స్ ఇచ్చారు గులాబీ అధినేత కేసీఆర్. ఇక, కామారెడ్డిలో సీఎం కేసీఆరే స్వయంగా బరిలోకి దిగనుండటంతో …సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు టికెట్ దక్కలేదు!
ఆ సిట్టింగ్‌లను మార్చి మరొకరికి..
స్టేషన్‌ఘన్‌పూర్ – తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి చోటు..
ఉప్పల్ – భేతి సుభాష్‌రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి చోటు..
వైరా – రాములునాయక్ స్థానంలో మదన్‌లాల్ కి చోటు..
వేములవాడ – చెన్నమనేని రమేష్ స్థానంలో, చల్మెడ లక్ష్మీనర్సింహారావుకి చోటు..
ఖానాపూర్ – రేఖానాయక్ స్థానంలో జాన్సన్ నాయక్ కి చోటు..
బోథ్ – రాథోడ్ బాపూరావు స్థానంలో అనిల్ జాదవ్ కి చోటు..
ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మి కి చోటు..
కామారెడ్డి – గంప గోవర్ధన్ స్థానంలో కేసీఆర్‌కి చోటు..
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితా ట్వీట్మొత్తం 119 నియోజకవర్గాల్లో 115 సీట్లకు అభ్యర్ధుల్ని ప్రకటించారు కేసీఆర్. అందులో 8మంది సిట్టింగులను మార్చగా, 4 స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్, జనగాం అభ్యర్ధులను ప్రకటించలేదు. ఈ నాలుగు సీట్లలో ఇంకా అభ్యర్ధుల పరిశీలన జరుగుతుందన్నారు కేసీఆర్.