Telangana: తెలంగాణ బీజేపీలోకి భారీగా చేరికలు.. వాళ్లెవరో క్లారిటీ వచ్చేది అప్పుడేఎన్నికలు దగ్గరపడుతోన్న తరుణంలో తెలంగాణ బీజేపీ మైండ్‌గేమ్ మొదలుపెట్టింది. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోన్న కాషాయదళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. అందుకోసం వలసలపై ఫోకస్‌పెట్టి సీక్రెట్ ఆపరేషన్ చేస్తోంది. మొన్న ఈటల అదే చెప్పారు. నిన్న రఘునందన్ అదే మాటన్నారు. టీబీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి కూడా వాళ్లిద్దరు చెప్పిందే చెప్పారు. గుట్టుచప్పుడు కాకుండా ముఖ్యనేతలకు గాలమేసింది బీజేపీ. అది కూడా ఇద్దరో ముగ్గురో కాదు… ఏకంగా 22మంది!. అవును, 22మంది మెయిన్ లీడర్స్…తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం రోజురోజుకీ మారుతోంది. ఎన్నికలు దగ్గరపడుతోన్న తరుణంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పార్టీలు అస్త్ర శస్త్రాలతో ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ దూకుడు పెంచగా, కాంగ్రెస్ సైతం పావులు కదుపుతోంది. ఇదిలా ఉంటే బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను తమ పార్టీలోకి లాగేందుకు సీక్రెట్ ఆపరేషన్‌ను చేపడుతున్నట్లు వార్తలు స్తున్నాయి. ఇప్పటికే బీజేపీలో చేరేందుకు 22 మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు సూచనప్రాయంగా తెలిపారు.ఎన్నికలు దగ్గరపడుతోన్న తరుణంలో తెలంగాణ బీజేపీ మైండ్‌గేమ్ మొదలుపెట్టింది. ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటోన్న కాషాయదళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. అందుకోసం వలసలపై ఫోకస్‌పెట్టి సీక్రెట్ ఆపరేషన్ చేస్తోంది. మొన్న ఈటల అదే చెప్పారు. నిన్న రఘునందన్ అదే మాటన్నారు. టీబీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి కూడా వాళ్లిద్దరు చెప్పిందే చెప్పారు. గుట్టుచప్పుడు కాకుండా ముఖ్యనేతలకు గాలమేసింది బీజేపీ. అది కూడా ఇద్దరో ముగ్గురో కాదు… ఏకంగా 22మంది!. అవును, 22మంది మెయిన్ లీడర్స్… బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ఈటల, రఘునందన్ తెలిపారు.
ఈ నెల 27న అమిత్‌షా సమక్షంలో ఆ నాయకులు కమలం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఖమ్మంలో జరగనున్న సభలో నేతలు బీజేపీలో చేరనున్నారని తెలిపారు. అయితే ఆ 22మంది ఎవరో చెప్పేందుకు ఈటల నిరాకరించారు. వాళ్లెవరో తెలియాలంటే 7రోజులు ఆగాలని రఘునందన్ సస్పెన్స్‌ను పెంచేశారు. 22మందిలో కొందరు ఆరోజు చేరతారన్న ఈటల, మిగతా నేతల కోసం చర్చలు జరుగుతున్నట్టు చెప్పుకొచ్చారు. ఈనెల 27 తర్వాత నిత్యం చేరికలు ఉంటాయని తెలిపారు.అందుకే రూటు మార్చిందా..
పొంగులేటి, జూపల్లి ఎపిసోడ్ తర్వాత బీజేపీ రూటు మార్చినట్లు స్పష్టమవుతోంది. బహిరంగంగా చర్చలు జరపడం వల్లే వాళ్లిద్దరూ చేజారిపోయారని అంచనాకి వచ్చిన కమలదళం, ఇప్పుడు సీక్రెట్‌గా ఆపరేషన్ చేపడుతోంది. మరి, ఇది మైండ్గేమో లేక సీక్రెట్ ఆపరేషనో తెలియదుగాని, 22మంది ముఖ్యనేతలు పార్టీలో చేరడం ఖాయమంటోంది బీజేపీ.అమిత్‌షా ఖమ్మం సభలో కొందరు చేరతారని, మిగతా లీడర్లు త్వరలోనే కమలం గూటికి వస్తారని చెబుతున్నారు. అయితే, ఆ 22మంది నేతలు… బీఆర్ఎస్ వాళ్లా? లేక కాంగ్రెస్ వాళ్లా తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే!