Megastar Chiranjeevi Fans are disappointed after Bhola Shankar movie flopped
Jailer vs Bhola Shankar : సూపర్‌స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే.. మెగాస్టార్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటేమళ్లీ హిట్ కావాలంటే ఎంత కష్టపడాలి? ఇంకో ఫ్లాప్ లేకుండా ఎలా జాగ్రత్తపడాలి.? ఇలాంటి విషయాలు ఎప్పుడూ డిస్కషన్లో ఉంటూనే ఉంటాయి. కాకపోతే, ఈ సారి ఒక మెగాస్టార్‌ని, ఒక సూపర్స్టార్నీ కంపేర్ చేస్తూ ఈ విషయాలన్నీ ఇంట్రస్టింగ్ వేలో వెళ్తున్నాయి. ప్యాన్ ఇండియా స్టార్లంటూ ఇప్పుడు ప్రత్యేకంగా హీరోలకు ఇమేజ్ వస్తోంది కానీ, అసలు అలాంటి కాయినింగ్ కూడా లేకముందే ప్యాన్ ఇండియా స్టార్ రజనీకాంత్.ఒక్క హిట్.. ఒక్క ఫ్లాప్ అప్పటిదాకా ఉన్న ఇమేజ్ అంతటినీ తుడిచిపెట్టేస్తుందా.? మళ్లీ హిట్ కావాలంటే ఎంత కష్టపడాలి? ఇంకో ఫ్లాప్ లేకుండా ఎలా జాగ్రత్తపడాలి.? ఇలాంటి విషయాలు ఎప్పుడూ డిస్కషన్లో ఉంటూనే ఉంటాయి. కాకపోతే, ఈ సారి ఒక మెగాస్టార్‌ని, ఒక సూపర్స్టార్నీ కంపేర్ చేస్తూ ఈ విషయాలన్నీ ఇంట్రస్టింగ్ వేలో వెళ్తున్నాయి. ప్యాన్ ఇండియా స్టార్లంటూ ఇప్పుడు ప్రత్యేకంగా హీరోలకు ఇమేజ్ వస్తోంది కానీ, అసలు అలాంటి కాయినింగ్ కూడా లేకముందే ప్యాన్ ఇండియా స్టార్ రజనీకాంత్.తలైవాకి, ఆయన పెక్యూలియర్ స్టైల్‌కి నార్త్ లోనూ ఎప్పుడూ సూపర్ క్రేజ్ ఉండేది. తలైవ సినిమా విడుదలవుతుందంటే జపాన్‌లో ఫ్యాన్స్ పండగ చేసుకునేవారంటే ఆ చరిష్మాని అర్థం చేసుకోవచ్చు. అయితే జైలర్‌కి ముందు పర్ఫెక్ట్ హిట్ లేదు రజనీకి. జైలర్ సినిమా గురించి కూడా స్టార్టింగ్‌లో రకరకాల వార్తలు వినిపించాయి. బీస్ట్ మూవీతో అట్టర్ ఫ్లాప్ ఇచ్చిన నెల్సన్, రజనీకాంత్‌ని ఏం చేస్తారోనని డైరక్ట్ గా అన్నవాళ్లు కూడా లేకపోలేదు. ఈ విషయాన్ని రజనీకాంత్ కూడా ఓపెన్‌గా చెప్పారు. అయితే సబ్జెక్ట్ బలంగా ఉంటే, సెంటిమెంట్లన్నీ ఆటోమేటిగ్గా పక్కకి వెళ్లిపోతాయని ప్రూవ్ చేసింది జైలర్ సినిమా.400 ప్లస్ క్రోర్స్ కలెక్షన్లతో దూసుకుపోతోంది రజనీకాంత్ జైలర్. తమిళనాడులో సూపర్‌స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే, లాస్ట్ వీక్ రిలీజ్ అయిన భోళా శంకర్ చూసి మెగాస్టార్ ఫ్యాన్స్ మాత్రం తల దించుకుంటున్నారు. ఇదేం సినిమా బాస్, అసలు ఎందుకు ఒప్పుకున్నారు అని అంటున్నారు.మెహర్ రమేష్ గత సినిమాల రిజల్టు చూసి కూడా ఏ నమ్మకంతో ఈ సినిమా ఇచ్చారంటూ సోషల్ మీడియా నిండా రకరకాల పోస్టులు వైరల్ అవుతూనే ఉన్నాయి. భోళా ఫ్లాప్ అయినా, వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్‌ను మరోసారి గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. నెక్స్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ సినిమాను ఇవ్వండి బాస్ అని చెబుతున్నారు. ఒక్క హిట్ ఇస్తే, పాత ఫ్లాప్లన్నిటినీ మర్చిపోస్తామంటూ బూస్టప్ ఇస్తున్నారు.