Video: టార్గెట్ 408.. 127కే 5 వికెట్లు డౌన్.. ఓటమి అంచున భారత్.. కట్‌చేస్తే.. షాకిచ్చిన 17 ఏళ్ల కుర్రాడు..On This Day in Cricket: ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి ప్రమాదంలో పడింది. ఆగస్టు 14న అంటే భారత స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు మ్యాచ్ ముగియాల్సి ఉంది. అయితే బ్రిటీష్ వారి నుంచి టీమ్ ఇండియా ఓటమి ముప్పును ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో 17 ఏళ్ల సచిన్ మాత్రమే బ్రిటీష్ వారితో పోరాడాడు. దేశ ప్రజలంతా స్వాతంత్య్రం కోసం ఎంతలా పోరాడారో.. అదే స్ఫూర్తితో సచిన్ కూడా ఈ మ్యాచ్ గెలిచాడు.Sachin Tendulkar: క్రికెట్ మైదానంలో సెంచరీ చేయడం చాలా పెద్ద విషయం. ఒక బ్యాట్స్‌మెన్ ఖాతాలో సెంచరీల సంఖ్య ఎంతగా పెరుగుతుంటే.. ఆ ఆటగాడి కెరీర్ కూడా అంతే గొప్పగా ఉంటుంది. కానీ, అంతర్జాతీయ క్రికెట్లో వందల సెంచరీలు చేసే ఓ బ్యాట్స్‌మెన్ వస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. అయితే, ప్రస్తుతం ఈ ఆటగాడు అందరికీ తెలుసు. పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా సచిన్ రికార్డులు నెలకొల్పాడు. ఈ సెంచరీల ప్రయాణం ఈ రోజున అంటే ఆగస్టు 14 న, అది కూడా ఇంగ్లాండ్ గడ్డపై ప్రారంభమైందని మీకు తెలుసా.ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి ప్రమాదంలో పడింది. ఆగస్టు 14న అంటే భారత స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు మ్యాచ్ ముగియాల్సి ఉంది. అయితే బ్రిటీష్ వారి నుంచి టీమ్ ఇండియా ఓటమి ముప్పును ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో 17 ఏళ్ల సచిన్ మాత్రమే బ్రిటీష్ వారితో పోరాడాడు. దేశ ప్రజలంతా స్వాతంత్య్రం కోసం ఎంతలా పోరాడారో.. అదే స్ఫూర్తితో సచిన్ కూడా ఈ మ్యాచ్ గెలిచాడు. అంటే, ఈ మ్యాచ్‌ని డ్రా చేసుకోవడం ద్వారా భారత్ ఓటమిని తప్పించాడు. బ్రిటీష్ విజయానికి అడ్డుకట్ట వేశాడు.దిగ్గజాలు పెవిలియన్ బాట..ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 519 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ 179, సంజయ్ మంజ్రేకర్ 93, సచిన్ టెండూల్కర్ 68 పరుగులతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులు చేసింది. ఇంగ్లండ్ నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి భారత్‌కు 408 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యం ముందు భారత జట్టు తడబడింది. మ్యాచ్ చివరి రోజున భారత్ తన ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ 127 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ (0), రవిశాస్త్రి, (12), సంజయ్ మంజ్రేకర్ (50), దిలీప్ వెంగ్‌సర్కార్ (32), మహ్మద్ అజారుద్దీన్ (11) పెవిలియన్‌కు చేరుకున్నారు. భారత్‌పై ఓటమి ప్రమాదం పొంచి ఉంది.
అవమానాన్ని కాపాడిన సచిన్..ఆ తర్వాత టీమిండియాను ఓటమి నుంచి కాపాడే బాధ్యతను సచిన్ తీసుకున్నాడు. ఇంగ్లిష్ బౌలర్లను తలదన్నేలా పోరాడాడు. కపిల్ దేవ్ అతనికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ, అతను 26 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు. భారత జట్టు మళ్లీ కష్టాల్లో కూరుకుపోయినా సచిన్ నిలబడి పోరాడేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో మనోజ్ ప్రభాకర్ ఆయనకు మద్దతుగా నిలిచారు. వీరిద్దరూ కలిసి ఏడో వికెట్‌కు 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు.
సచిన్ తొలి సెంచరీ..
ఈ మ్యాచ్‌లో సచిన్ 189 బంతులు ఎదుర్కొని 17 ఫోర్లతో అజేయంగా 119 పరుగులు చేశాడు. అప్పటికి సచిన్ వయసు 17 ఏళ్ల 112 రోజులు మాత్రమే. ఆ సమయంలో సచిన్ టెస్టు సెంచరీ చేసిన పిన్న వయస్కుల జాబితాలోకి వచ్చాడు. అయితే ఇది ఎవ్వరూ ఊహించని సెంచరీ జర్నీకి నాంది అని సచిన్‌కి కూడా తెలియదు. ఇది సచిన్‌కి తొలి అంతర్జాతీయ సెంచరీ కాగా, తర్వాత అంతర్జాతీయ వేదికపై 100 సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో మనోజ్ ప్రభాకర్ 128 బంతులు ఎదుర్కొంటూ ఎనిమిది ఫోర్లు బాదాడు.