Salaar: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. నెల రోజుల గ్యాప్‌లో 2 సార్లు రిలీజ్సలార్ సినిమా నెల రోజుల గ్యాప్‌లో రెండుసార్లు విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇదేం చిత్రమండీ బాబూ.. రెండుసార్లు ఎందుకు రిలీజ్ చేయడం అనుకుంటున్నారా..? సలార్ గురించి ఓ న్యూస్ తెలిసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఇలాంటి పార్టీలే చేసుకుంటున్నారు. రెక్కలు కట్టుకుని గాల్లో తేలిపోతున్నారు వాళ్లు. వరస ఫ్లాపుల నేపథ్యంలో ప్రభాస్‌కు సలార్ కీలకంగా మారింది. ఫ్యాన్స్ కూడా దీన్ని చాలా ప్రస్టేజియస్‌గా తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే..ప్రభాస్ సినిమా ఒక్కసారి రిలీజ్ అయితేనే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది ఒకే సినిమా నెలలో రెండుసార్లు విడుదలైతే.. విచిత్రంగా ఉంది కదా వినడానికి కూడా..! కానీ అదే జరగబోతుంది.. సలార్ సినిమా నెల రోజుల గ్యాప్‌లో రెండుసార్లు విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఇదేం చిత్రమండీ బాబూ.. రెండుసార్లు ఎందుకు రిలీజ్ చేయడం అనుకుంటున్నారా..? సలార్ గురించి ఓ న్యూస్ తెలిసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఇలాంటి పార్టీలే చేసుకుంటున్నారు. రెక్కలు కట్టుకుని గాల్లో తేలిపోతున్నారు వాళ్లు. వరస ఫ్లాపుల నేపథ్యంలో ప్రభాస్‌కు సలార్ కీలకంగా మారింది. ఫ్యాన్స్ కూడా దీన్ని చాలా ప్రస్టేజియస్‌గా తీసుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో రానున్నాడు ప్రశాంత్. తాజాగా సలార్ సినిమానుంచి ఓ గుడ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది.నెక్ట్స్ ప్రాజెక్ట్ Kతో హాలీవుడ్‌లోనూ సత్తా చూపించాలని ఫిక్సయ్యారు ప్రభాస్. దీనికి ముందే సలార్‌ను ఓ టీజర్లా వాడుకోబోతున్నారు. సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28న విడుదల కానుంది. దీనికోసం ఆగస్ట్ ఎండింగ్ నుంచే ప్రమోషన్స్‌తో బిజీ కానున్నారు ప్రభాస్. బాహుబలి, సాహో మాదిరే.. దేశవ్యాప్తంగా భారీగా ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు ప్రభాస్. ఇదిలా ఉండగా సలార్ నెల రోజుల గ్యాప్‌లో 2 సార్లు విడుదల కానుందనే న్యూస్ బయటికొచ్చింది.
ఒకటి ఇండియన్ వర్షన్ అయితే.. మరోటి ఇంగ్లీష్ వర్షన్. సలార్ హాలీవుడ్ వర్షన్ ఉంటుందని చెప్పిన ప్రశాంత్ నీల్.. పాటలు లేకుండా దీన్ని సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 28నే హాలీవుడ్‌లోనూ విడుదల చేయాలనుకున్నా.. కాస్త ఆలస్యమయ్యేలా ఉండటంతో అక్టోబర్‌లో ఆ వర్షన్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సలార్ ఓవర్సీస్ రైట్స్ తీసుకున్న ఫార్స్ ఫిల్మ్స్ అమెరికా సహా మేజర్ మార్కెట్స్‌లో హాలీవుడ్ వర్షన్ రిలీజ్ చేయనున్నారు. అలా మొత్తానికి 30 రోజుల వ్యవధిలో సలార్ రెండు సార్లు విడుదల కానుందన్నమాట. అటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న కల్కీ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి రీసెంట్ గా కల్కీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.