Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. చిన్నారి పైనుంచి వెళ్లిన స్కూల్ బస్సు.. అక్కడికక్కడే..Bachupally road accident: తండ్రి చిన్నారితో కలిసి బైక్ పై వెళ్తుండగా.. గుంత రావడంతో బ్రేక్ వేశాడు. ఈ సమయంలో వెనుక నుంచి స్పీడ్‌గా వస్తున్న స్కూల్ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో చిన్నారి ఆమె తండ్రి కింద పడిపోయారు. ఈ క్రమంలో కిందపడిన చిన్నారిపై నుంచి బస్సు వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ఘోర ప్రమాదం హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో జరిగింది.Bachupally road accident: హైదరాబాద్ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డుపై ఏర్పడిన గుంతలు, స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందింది. తండ్రి చిన్నారితో కలిసి బైక్ పై వెళ్తుండగా.. గుంత రావడంతో బ్రేక్ వేశాడు. ఈ సమయంలో వెనుక నుంచి స్పీడ్‌గా వస్తున్న స్కూల్ బస్సు.. బైక్‌ను ఢీకొట్టింది. దీంతో చిన్నారి ఆమె తండ్రి కింద పడిపోయారు. ఈ క్రమంలో కిందపడిన చిన్నారిపై నుంచి బస్సు వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ఘోర ప్రమాదం హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో జరిగింది.సాఫ్ట్వేర్ ఉద్యోగి కిశోర్ దంపతులకు ఎనిమిదేళ్ల చిన్నారి దీక్షిత ఉంది. వీరు భౌరంపేటలోని ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్నివాసముంటున్నారు. కాగా.. చిన్నారి దీక్షిత బౌరంపేట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతోంది. రోజూలానే బుధవారం ఉదయం కిషోర్ చిన్నారిని స్కూల్లో దింపేందుకు స్కూటీపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో రెడ్డీస్ ల్యాబ్ దగ్గర రోడ్డుపై గుంత ఉండటంతగో సడెన్ బ్రేక్‌వేశాడు. ఈ క్రమంలో వెనుక నుండి వచ్చిన స్కూల్ బస్సు స్కూటీని ఢీకొట్టగా.. కిశోర్ఎడమ వైపు .. పాప దీక్షిత కుడి వైపు పడిపోయారు. ఈ క్రమంలో స్కూల్ బస్సు పాపపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలతో చిన్నారి అక్కడిక్కడే మరణించింది. చిన్నారి తండ్రికి తీవ్ర గాయాలు కాగా.. అతన్ని ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో దీక్షిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డుపై ఉన్న గుంతలకారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.