PM Modi – Sharad Pawar: ప్రధాని మోడీకి ప్రతిష్టాత్మక పురస్కారం.. వేదికపై ఆసక్తికర ఘటన.. వీడియో..Lokmanya Tilak National Award ceremony: రాజకీయాల్లో శాశ్వాత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు.. ఈవిషయం మరోసారి రుజువయ్యింది. ప్రధాని మోడీకి పుణేలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం కన్పించింది. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా హాజరయ్యారు. దీంతో ఇండియా కూటమిలో ఉన్న శరదపవార్ .. ఎన్డీఏ కూటమికి దగ్గరవుతున్నారా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.Lokmanya Tilak National Award ceremony: రాజకీయాల్లో శాశ్వాత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు.. ఈవిషయం మరోసారి రుజువయ్యింది. ప్రధాని మోడీకి పుణేలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం కన్పించింది. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా హాజరయ్యారు. దీంతో ఇండియా కూటమిలో ఉన్న శరదపవార్ .. ఎన్డీఏ కూటమికి దగ్గరవుతున్నారా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే, ఇది రాజకీయ కార్యక్రమం కాదని.. దీన్ని ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఏడేళ్ల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ ఒకే వేదికపై కన్పించారు. ఈ సందర్భంగా వేదికపై ఇద్దరు నేతలు అప్యాయంగా పలుకరించుకున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు ముందే ప్రకటించారు శరద్‌పవార్. మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీ సీఎం అజిత్‌పవార్ కూడా లోకమాన్య తిలక్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమికి రూపకల్పన చేసిన శరద్‌పవార్‌కు అజిత్‌పవార్ షాకిచ్చి.. బీజేపీతో ఆయన జతకట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.మరపురాని క్షణం: ప్రధాని మోడీ..
లోకమాన్య తిలక్ జాతీయ అవార్డుతో సత్కరించడంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇది మరపురాని క్షణమంటూ పేర్కొన్నారు. ఈ ప్రైజ్ మనీని నమామి గంగే ప్రాజెక్టుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఈ అవార్డును అంకితం చేయాలనుకుంటున్నానని తెలిపారు. భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో లోకమాన్య తిలక్ పాత్ర.. సహకారం ఎప్పటికీ ఆదర్శమని ప్రధానమంత్రి పేర్కొన్నారు.రాజకీయంగా..
లోకమాన్య తిలక్ అవార్డు ప్రదానోత్సవానికి రాజకీయ ప్రాధాన్యత లేదని నిర్వాహకులు అంటున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే కూడా హాజరైన విషయాన్ని కూడా నొక్కిచెబుతున్నారు. అయితే, పుణేలో మోదీ పాల్గొనే కార్యక్రమానికి శరద్‌పవార్ వెళ్లకుంటే బాగుండేదని ఉద్దవ్‌ఠాక్రే సూచించినట్టు తెలుస్తోంది. ఇది మంచి సంకేతం కాదని ఆయన పవార్‌తో అన్నట్టు ప్రచారం జరిగింది. అయితే నెలరోజుల క్రితమే ఈ పోగ్రామ్ ఖరారయ్యిందని ఉద్దవ్‌కు పవార్ నచ్చచెప్పినట్టు చెబుతున్నారు. మోదీతో వేదిక పంచుకోవద్దని ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ చేసిన అభ్యర్థనను పవార్ అంగీకరించలేదని.. ఇండియా కూటమి ఎంపీలను కూడా కలవలేదని సమాచారం.1983 నుంచి లోకమాన్య తిలక్ అవార్డు..
లోకమాన్య తిలక్ అవార్డును ‘అత్యున్నత నాయకత్వం’, ‘పౌరులలో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించినందుకు గాను ప్రధానమంత్రి మోడీకి ఈ అవార్డుతో సత్కరించారు. తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్ 1983 నుంచి ఈ అవార్డును అందజేస్తోంది. ఈ అవార్డును లోకమాన్య తిలక్ వర్ధంతి అయిన ఆగస్టు 1న ప్రతి సంవత్సరం అందజేస్తారు.