Telangana: భయంతోనే సీఎం కేసీఆర్ ఆ నిర్ణయం మార్చుకున్నారట.. సంచలన కామెంట్స్ చేసిన భట్టి విక్రమార్క..Telangana: బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు కాంగ్రెస్ నేతలు. వరదల వల్ల ఎంత నష్టం జరిగింది అంచనా కోసం ఒక కమిటీ వేసిన కాంగ్రెస్.. ఆ రిపోర్ట్ ని కూడా గవర్నర్ కి అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాష్ట్రంలో భారీ వర్షాల బీభత్సం వల్ల సృష్టించిన వరదలతో జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం గురించి సమాచారం సేకరించి గవర్నర్ వివరించామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల జరిగిన విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యల్లో..హైదరాబాద్, ఆగస్టు 01: సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో నష్టపోయిన పరిస్థితులను రాజ్ భవన్లో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ కు వివరించింది టిపిసిసి బృందం. వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు కాంగ్రెస్ నేతలు. వరదల వల్ల ఎంత నష్టం జరిగింది అంచనా కోసం ఒక కమిటీ వేసిన కాంగ్రెస్.. ఆ రిపోర్ట్ ని కూడా గవర్నర్ కి అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. రాష్ట్రంలో భారీ వర్షాల బీభత్సం వల్ల సృష్టించిన వరదలతో జరిగిన ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం గురించి సమాచారం సేకరించి గవర్నర్ వివరించామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల జరిగిన విపత్తు నుంచి ప్రజలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ వాస్తవ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.ప్రజల అవసరాల కోసం కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం అధికార యంత్రాంగాన్ని వాడటం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగం వైఫల్యం చెందిందని విమర్శించారు. సోమవారం నాటి కేబినెట్ నిర్ణయాలపైనా తీవ్ర విమర్శలు చేశారు భట్టి విక్రమార్క.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ పార్టీ విజయం..
‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరినప్పుడు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా దుర్భషలాడుతూ నీతిమాలిన, పనికిమాలిన, ఆలోచన లేని నాయకులంటూ తప్పు పట్టిన కేసీఆర్.. మా ప్రకటన చూసి మనసు మార్చుకున్నట్టున్నారు. 2023 -24 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ విజయంగా భావించాలి. ఆర్టీసీకి ఆస్తులు కూడబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో కూడపెట్టిన ఆర్టీసీ ఆస్తులను బిఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టడానికి చూస్తే రోడ్లపైకి వస్తాం.’ అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు బట్టి విక్రమార్క.