IND vs WI 3rd ODI: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. సిరీస్ డిసైడర్ మ్యాచ్ నుంచి కోహ్లీ ఔట్.. కారణం ఏంటంటే?India vs West Indies 3rd ODI: నేడు (ఆగస్టు 1) భారత్, వెస్టిండీస్ మధ్య మూడో, చివరి వన్డే జరగనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కనిపించడం అనుమానంగానే ఉంది. 2వ వన్డే సమయంలో విశ్రాంతి తీసుకున్న కోహ్లి 3వ మ్యాచ్‌కి కూడా దూరమయ్యే అవకాశం ఉంది.India vs West Indies 3rd ODI: నేడు (ఆగస్టు 1) భారత్, వెస్టిండీస్ మధ్య మూడో, చివరి వన్డే జరగనుంది. ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కనిపించడం అనుమానంగానే ఉంది. 2వ వన్డే సమయంలో విశ్రాంతి తీసుకున్న కోహ్లి 3వ మ్యాచ్‌కి కూడా దూరమయ్యే అవకాశం ఉంది.పోర్ట్ ఆఫ్ స్పెయిన్ నుంచి టీమ్ ఇండియా ఇప్పటికే ట్రినిడాడ్‌లో అడుగుపెట్టింది. కానీ, విరాట్ కోహ్లీ భారత జట్టుతో కలిసి ప్రయాణించలేదు. దీంతో మూడో వన్డేలో విరాట్ కోహ్లి కనిపించే ఛాన్స్ లేదని అంటున్నారు. సోమవారం సాయంత్రం ట్రినిడాడ్ చేరుకున్న భారత ఆటగాళ్లు మంగళవారం మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు. అతను సిరీస్ డిసైడర్‌కు అందుబాటులో ఉండడంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి.విరాట్ కోహ్లి సోమవారం సాయంత్రం పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు భారత జట్టుతో కలిసి వెళ్లలేదు. దీంతో మంగళవారం నాటి వన్డే సిరీస్ నిర్ణయాత్మక వన్డేకు అతను అందుబాటులో ఉండడు అనే ఊహాగానాలు పెరిగాయి.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు విశ్రాంతినిచ్చారు. కానీ, ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ని 1-1తో సమం చేసింది. దీంతో మంగళవారం జరగనున్న చివరి వన్డే మ్యాచ్ ఫైనల్ పోరుగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోవచ్చు. కాబట్టి, ఫైనల్ వన్డేలో తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది.వెస్టిండీస్ వన్డే జట్టు: షాయ్ హోప్ (కెప్టెన్), బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అతానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రొమారియో షెపర్డ్, డొమినిక్ డ్రేక్స్, యానిక్ కారియా, గుడాకేష్ మోతీ, జాడెన్ సీల్స్, కేసీ కార్తీ, ఒషానే థామస్, అల్జారీ థామస్, కెవిన్ సింక్లైర్.