Vishwak Sen: నవ్వుతూ నరాలు లాగేస్తాం.. అంటున్న విశ్వక్ సేన్.. ఆకట్టుకుంటున్న నయా మూవీ గ్లింప్స్రీసెంట్ గా దాస్ కా ధమ్కీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయిన పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు మాస్ కా దాస్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు విశ్వక్. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. గతంలో విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.యంగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న విశ్వక్ ఇప్పుడు మరో ఆసక్తికర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రీసెంట్ గా దాస్ కా ధమ్కీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోకపోయిన పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో అలరించడానికి రెడీ అవుతున్నాడు మాస్ కా దాస్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు విశ్వక్. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. గతంలో విశ్వక్ సేన్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ సినిమా పై అంచనాలను పెంచేసింది.ఈ వీడియో చేస్తుంటే సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. నేహశెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో సాయి కుమార్, అంజలి కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నాడు విశ్వక్ సేన్.” అన్నాయ్ మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం నవ్వుతూనే నరాలు లాగేస్తాం” అంటూ విశ్వక్ చెప్పే డైలాగ్ పవర్ ఫుల్ గా అనిపించింది. ఇసుక మాఫియా నేపథ్యంలో సినిమా ఉందనిపిస్తుంది.
ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిమిస్తున్న ఈ మూవీని డిసెంబర్ లో థియేటర్స్ లోకి తీసుకురానున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందంటున్నారు విశ్వక్ ఫ్యాన్స్.