Conjunctivitis: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోన్న కండ్లకలక.. భారీగా పెరుగుతోన్న కేసులుమంచిర్యాల జిల్లా జైపూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న 6 వందల మంది విద్యార్థుల్లో 4వందల మందికి కండ్లకలక వచ్చింది. ఒకరి నుంచి ఒకరికి ఇది సోకడం ఒకట్రెండు రోజుల్లో జరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇది కేవలం మంచిర్యాలకే పరిమితం కాలేదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా హెచ్చరికలు కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి అధికారికంగా నమోదైన కేసులో వెయ్యికిపైగా ఉన్నాయి. మొత్తంగా రెండున్నర వేల వరకూ కేసులు ఉండొచ్చన్నది అనధికారిక అంచనా…తెలుగు రాష్ట్రాల్లో కండ్లకలక కలకలం రేపుతోంది. రోజురోజుకీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వర్షాలు, వరదలకు తోడు ఈ కండ్లకలకం ప్రజలను ఇబ్బంది పెడుతోంది. రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటికి వరకు 2500పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క మంచిర్యాల జిల్లా జైపూర్ హాస్టల్లోనే 400 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. మంచిర్యాల జిల్లా జైపూర్ సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉన్న 6 వందల మంది విద్యార్థుల్లో 4వందల మందికి కండ్లకలక వచ్చింది. ఒకరి నుంచి ఒకరికి ఇది సోకడం ఒకట్రెండు రోజుల్లో జరిగిపోయింది. ఇదిలా ఉంటే ఇది కేవలం మంచిర్యాలకే పరిమితం కాలేదు..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా కూడా హెచ్చరికలు కనిపిస్తున్నాయి.. వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి అధికారికంగా నమోదైన కేసులో వెయ్యికిపైగా ఉన్నాయి. మొత్తంగా రెండున్నర వేల వరకూ కేసులు ఉండొచ్చన్నది అనధికారిక అంచనా. వానాకాలంలో సహజంగా కండ్లకలక వ్యాప్తి ఉంటుంది. కానీ ఈసారి ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమై కరోనా రేంజ్లో అవగాహన కల్పించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.
ఇంతకీ వ్యాధి ఎలా సోకుతుంటే..
వర్షం పడినప్పుడు భూ ఉపరితలంలో ఉన్న వైరస్, బ్యాక్టీరియా పైకి లేచి గాల్లో కలిసిపోతుంది. అది కంటి దాకా చేరినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఫలితంగా పింక్ ఐ వస్తుంది. దీన్నే కండ్లకలక అంటాం. ఒక్కసారి ఒక్కరికి సోకితే వైరల్గా మారిపోతుంది. క్షణాలు, రోజుల్లో వందలాదిమందికీ వ్యాపిస్తుంది. కండ్లకలకలో కనిపించే ప్రధాన లక్షణాలు.. తెల్లగుడ్డు ఎరుపు/గులాబీ రంగులోకి మారడం, విపరీతమైన కళ్లు నొప్పులు, కళ్ల నుంచి అదేపనిగా పుసులు, చూపు మందగించడం, కాంతిని చూడలేకపోవడం, మంటలు, నీరుకారడం, కనురెప్పల వాపు, ముద్దగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.