Watch Video: వచ్చారు.. రంగేశారు.. 30 లక్షలు దోచుకెళ్లారు.. మామూలు స్కేచ్ కాదుగా.. వీడియోనల్లగొండ, జులై 30: దొంగలు కూడా అందివచ్చిన ఆధునిక టెక్నాలజీతో దొచుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగా ఏటీఎం చోరీ చేయడం దొంగలకు కష్టంగా మారింది. దొంగతనం చేసే సమయంలో ఎవరి కంట పడకుండా ఉండేందుకు కొత్త ఆలోచన చేస్తున్నారు.. తాజాగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఏటీఏం చోరీ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలోనల్లగొండ, జులై 30: దొంగలు కూడా అందివచ్చిన ఆధునిక టెక్నాలజీతో దొచుకోవడం మొదలుపెట్టారు. సాధారణంగా ఏటీఎం చోరీ చేయడం దొంగలకు కష్టంగా మారింది. దొంగతనం చేసే సమయంలో ఎవరి కంట పడకుండా ఉండేందుకు కొత్త ఆలోచన చేస్తున్నారు.. తాజాగా నల్లగొండ జిల్లాలో జరిగిన ఏటీఏం చోరీ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని ప్రజా అవసరాల కోసం ఎస్బిఐ ఏటీఎంను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్ లో రెండు ఏటీఎం యంత్రాలు ఏర్పాటు చేశారు. అయితే, దొంగలు ఈ ఏటీఎంపై కన్నేశారు. ఇంకేముంది ప్రణాళిక రచించి అమాంతం దోచేశారు.
వ్యాన్ లో వచ్చిన ముగ్గురు దుండగులు ముసుగులు ధరించి ఉన్నారు. సరిగ్గా అర్ధరాత్రి ఏటీఎంలోకి ప్రవేశించారు. తమ దొంగతనం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ఉండేందుకు దొంగలు ఏటీఎంలోకి రాగానే సీసీ కెమెరాలపై బ్లాక్ కలర్ స్ప్రే చేశారు. ఏటీఎం అద్దాలను గడ్డపారలతో పగులగోట్టి లోపలికి ప్రవేశించినట్లుగా పోలీసులు గుర్తించారు. గ్యాస్ కట్టర్ల సహాయంతో ఏటీఎంను కట్ చేసి డబ్బులు చోరీ చేశారు.
వీడియో చూడండి..అయితే, రెండు ఏటీఎంలో కలిపి 30 లక్షల రూపాయలు చోరీ జరిగినట్లు బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. బ్యాంకు మేనేజర్ వీరబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. ఈ చోరీకి ముగ్గురు దుండగులు పాల్పడినట్లు సీసీ కెమెరాలు రికార్డు అయిందని పోలీసులు చెబుతున్నారు.కాగా.. ఇదే మాదిరిగా 8 నెలల క్రితం కేతేపల్లి ఏటీఎంలో కూడా చోరీ జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ చోరీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.