Watch: పోలీస్ స్టేషన్లోనే వంటావార్పు.. తాజా కరివేపాకుతో ఖాకీలు చేసిన చికెన్ కర్రీ..పోలీసులు వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది పోలీస్ స్టేషన్లోనే పోయ్యి పెట్టి వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందించారు.పోలీస్ స్టేషన్లో వంటావార్పు కార్యక్రమం జరుగుతోంది. అంతేకాదు పోలీసు సిబ్బంది ఖాకీ యూనిఫామ్‌లోనే వంటలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత, అది వైరల్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే ఈ ఘటనపై కేరళ పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలోని పఠన్తిట్టలోని ఎలవంతిట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.పోలీసు అధికారి ఒకరు ఖాకీ యూనిఫారం ధరించి చికెన్ వండుతూ, పప్పు పులుసు, ఇతర స్థానిక ప్రసిద్ధ వంటకాలను తయారు చేస్తున్నారు. పోలీసుల వంటలకు సంబంధించిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో ఇప్పటికే 9 లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంటనే పోలీసులకు నోటీసు పంపారు. ఈ మొత్తం ఘటనపై జిల్లా పోలీసులు వివరణ కోరారు.
ఇదిలా ఉంటే, పోలీసులు వంట చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు, పోలీస్ సిబ్బంది ఇలా పోలీస్ స్టేషన్లోనే వంట చేస్తారా- ఇలాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. ఈ వీడియోపై పలువురు ఎగతాళి చేశారు. చాలా మంది ఈ మొత్తం ఘటనను ఖండించారు. బాధ్యతా రహితంగా వ్యవహరించిన పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఇకపోతే, కొందరు ఈ వీడియో చూసిన పలువురు పోలీసు అధికారులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను చాలా మంది లైక్ చేశారు. వీడియోలో మలయాళంలో ఒక పాట ప్లే అవుతోంది.