Google Search: ఎట్టి పరిస్థితుల్లో గూగుల్‌లో దీనిని మాత్రం సెర్చ్ మాత్రం చేయొద్దు..ఒక ఫ్రాడ్ నెంబర్ని క్రియేట్ చేసి అదే కస్టమర్ కేర్ నెంబర్‌గా బోల్తా కొట్టించి.. కొంతమంది సైబర్ కేటుగాళ్లు గూగుల్ లోకి దూరి బాధితుల జేబుకు చిల్లు పెడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ప్రతి శాఖలోనూ కస్టమర్ కేర్ నంబర్ పేరుతో నకిలీ నంబర్లు గూగుల్‌లో ప్రత్యక్షమవుతున్నాయి.సాధారణంగా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వెంటనే కస్టమర్ కేర్ కు కాల్ చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో కస్టమర్ కేర్ నంబర్ తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే గూగుల్ లోకి వెళ్లి సంబంధిత కస్టమర్ కేర్ నెంబర్ అని టైప్ చేసి చూస్తాము… ఇదే సైబర్ నేరగాళ్లకు దొరికే వరం. గూగుల్ కస్టమర్ కేర్ నంబర్ల ద్వారా లక్షల పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఒక ఫ్రాడ్ నెంబర్ని క్రియేట్ చేసి అదే కస్టమర్ కేర్ నెంబర్‌గా బోల్తా కొట్టించి.. కొంతమంది సైబర్ కేటుగాళ్లు గూగుల్ లోకి దూరి బాధితుల జేబుకు చిల్లు పెడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ప్రతి శాఖలోనూ కస్టమర్ కేర్ నంబర్ పేరుతో నకిలీ నంబర్లు గూగుల్‌లో ప్రత్యక్షమవుతున్నాయి. అవే నిజమైన కస్టమర్ కేర్ నెంబర్ల అనుకుని బాధితులు మోసపోతున్న ఘటనలు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్నాయి.బ్యాంకు కస్టమర్ కేర్ నెంబర్ చేసి 2 లక్షలు క్షణాల్లో పోగొట్టుకున్న హైదరాబాది యువతి
హైదరాబాద్ కు చెందిన ఒక యువతి బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్ లో వెతికింది. గూగుల్ లో ఇదే బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ కేర్ నెంబర్ అంటూ ఒక నంబర్ కనిపించింది. దీంతో సోదరి యువతీ ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి తన సమస్య చెప్పింది. నిజమైన బ్యాంకు కస్టమర్ కేర్ గా బాధితురాలని నమ్మించారు సైబర్ ఫ్రాడ్ స్టర్స్. బాధితురాలికి ఒక లింకు పంపించి దాన్ని క్లిక్ చేసి ఓటీపీ చెప్పమని కోరారు. అది మోసపూరిత వ్యవహారం అని తెలియని యువతీ కేటగాళ్లు చెప్పిన విధంగా ఓటిపిల్లు చెప్పడంతో యువతి బ్యాంక్ ఖాతా నుండి 2 లక్షలు కట్ అయ్యాయి.. ఇది సైబర్ నేరగాళ్లు మోసమని గ్రహించిన యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ పేరుతో ఫేక్ కస్టమర్ కేర్ నెంబర్లు
ఇక మరో ఘటనలోనూ ఫేక్ కస్టమర్ కేర్ నంబర్ ఘటన చోటుచేసుకుంది. ఒకసారి ఏకంగా రైల్వే కు I R C T C టోల్ ఫ్రీ నెంబర్ అంటూ గూగుల్‌లో రిజిస్టర్ చేసుకున్నారు. ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేయాలనుకున్న ఓ బాధితురాలు గూగుల్ కి వెళ్లి చూడగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కనిపించింది. ఆ నెంబర్ కి ఫోన్ చేయగా ఒక యాప్‌ని బాధితురాలు ఫోన్లో ఇన్స్టాల్ చేపించి బాధితురాలు ఫోన్ యాక్సిస్ ను కొట్టేశారు దీంతో కంగుతిన్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఇలా పలు సందర్భాల్లో గూగుల్‌లోని టోల్ ఫ్రీ నెంబర్లను నమ్ముకొని మోసపోతున్న బాధితుల సంఖ్య అంతకింతకు పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గూగుల్ కి వెళ్లి టోల్ ఫ్రీ నెంబర్ అని సెర్చ్ చేయవద్దంటూ పోలీసులు సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే నేరుగా సంబంధిత వెబ్‌సైట్‌కి వెళ్లి మాత్రమే కస్టమర్ సర్వీస్ కాంటాక్ట్ చేయాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.