Vizag: ‘వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీలో ఉంటావ్?’.. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తూ సీటీ అంతా పోస్టర్లురాజకీయ నిలకడ లేని నేతా.. నీకో నమస్కారం? నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావు..? ఏ పార్టీలోకి వెళ్తావు..? ఇదే ఈ పోస్టర్ సారాంశం. అంతే కాదు వైఎస్సార్సీపీ, టీడీపీ, జన సేనల జండాలను ముద్రించిన ఈ పోస్టర్లు విశాఖలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి.రాజకీయ నిలకడ లేని నేతా.. నీకో నమస్కారం? నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావు..? ఏ పార్టీలోకి వెళ్తావు..? ఇదే ఈ పోస్టర్ సారాంశం. అంతే కాదు వైఎస్సార్సీపీ, టీడీపీ, జన సేనల జండాలను ముద్రించిన ఈ పోస్టర్లు విశాఖలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి.వైసీపీలో చేరినప్పటి నుంచే విబేధాలు
వాస్తవానికి తెలుగుదేశం పార్టీతోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన వాసుపల్లి గణేష్ రెండుసార్లు ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ విశాఖ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ గా సేవలందించి పదవీ విరమణ అనంతరం డిఫెన్స్ అకాడమీ స్థాపించి, విద్యావేత్తగా కూడా రాణించి అనంతరం రాజకీయాల్లోకి వచ్చి బలమైన మత్స్యకార సామాజిక వర్గ నేతగా గుర్తింపు పొందారు. అయితే తెలుగుదేశం పార్టీలో గెలిచి వైసిపి లోకి ఆయన వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న వైసీపీ శ్రేణులతో ఆయనకి సఖ్యత కుదరలేదు. గణేష్ వైసిపిలో చేరే సమయానికి సరిగ్గా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉండడం ఆ సమయంలో అప్పటికే వైసిపి తమ కార్పొరేటర్ అభ్యర్థులని నిలబెట్టడం సరిగ్గా అదే సమయంలో పార్టీలో చేరిన నేపథ్యంలో టిడిపి నుంచి తనతోపాటు వచ్చిన ముఖ్య నేతలు కూడా కార్పొరేటర్లుగా బరిలో ఉండడంతో టికెట్లు పంపిణీ వ్యవహారం గందరగోళం అయింది. టిడిపి నుంచి గణేష్ తో వచ్చిన కొందరికి టికెట్లు దక్కినా వాళ్ళు ఓడిపోవడం, మొదటి నుంచి వైసీపీలో ఉన్న అభ్యర్థులు రెబల్స్ గా మారి ఇండిపెండెంట్ లుగా విజయం సాధించడంతో గణేష్ కి వారికి మధ్య అప్పటినుంచి వైరం నడుస్తూనే ఉంది. గణేష్ స్థానిక ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్లు ఎవరూ ఆయన దగ్గరికి వెళ్లరు సరి కదా ఆయనకు వ్యతిరేకంగానే ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తుంటారు. పార్టీ అధిష్టానం జోక్యంచేసుకొని తాత్కాలికంగా సర్ది చెప్పే ప్రయత్నం జరిగినా మళ్లీ అవే ఘటనలు పునరావృతం అవుతూ వస్తూనే ఉన్నాయి
బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఎంట్రీ
సరిగ్గా అదే సమయంలో వాసుపల్లి గణేష్ కి స్థానిక కార్పొరేటర్లకి మధ్య గ్యాప్ ఉండడం, గణేష్ ఇంకా కుదురుకొక పోవడం, గణేష్ మళ్లీ టీడీపీ లోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఎంట్రీ ఇచ్చాడు రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్ కుటుంబానికి సన్నిహిత నేతగా పేరు ఉన్న సీతంరాజు సుధాకర్. గణేష్ వైసీపీ లో చేరకముందే దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న కోరిక బలంగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన సీతం రాజు సుధాకర్ అక్కడ పార్టీలో ఉన్న గ్రూప్ తగదాలని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారట. విశాఖలో సౌత్ నియోజకవర్గం నుంచి గతంలో ద్రోణం రాజు సత్యనారాయణz ద్రోణంరాజు శ్రీనివాస్ లాంటి బ్రాహ్మణ నేతలు ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉండడం, అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గ ఓట్లు కూడా అధికంగా ఉండడం తో అక్కడి నుంచి పోటీ చేయాలన్న కోరిక ఆయనకు బలంగా మొదటి నుంచే ఉందట. దీంతో గణేష్ పై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్ లని దగ్గరికి తీసుకొని వాళ్లతో నియోజకవర్గంలో రాజకీయం చేయడం ప్రారంభించాడట. అది గణేష్ కి ఇబ్బందిగా మారింది మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా ఆ తర్వాత సుధాకర్ నియోజకవర్గంలో కీలక సమావేశాలు నిర్వహిస్తూ చొచ్చుకుపోయే ప్రయత్నం చేయడంతో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు వాసుపల్లి. దీనిపై అనేకమార్లు పంచాయతీలు కూడా జరిగాయి. ఒక దశలో ఇలా ఉంటే పార్టీలో కొనసాగడం కష్టం అంటూ బహిరంగంగా వాసుపల్లి వ్యాఖ్యానించడం ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిసి హామీ పొందడం లాంటివి కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో సీతంరాజు సుధాకర్ ని వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. దీంతో ఇక సుధాకర్ బెడద దక్షిణ నియోజకవర్గానికి ఉండదని గణేష్ కి భరోసా ఇచ్చింది వైఎస్ఆర్సిపి అధిష్టానం. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి ఓటమి చెందడంతో మళ్లీ దక్షిణ నియోజకవర్గంపై దృష్టి సారించారు సీతం రాజు సుధాకర్.ఈ నేపథ్యంలో తాజాగా వెలిసిన ఈ పోస్టర్లు ప్రతిపక్షాల కంటే సొంత పార్టీలోని నేతల పనే అన్నది గణేష్ వాదనట. దీనికి సంబంధించి ప్రతిపక్ష నేతలని కూడా ఆయన ఆరా తీసారట. అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గణేష్ వైసిపి లోకి రావడంతో టిడిపిలో నాయకత్వ సమస్య ఏర్పడింది. దాంతో గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన గండి బాబ్జిని నగరానికి తీసుకొచ్చి అక్కడ ఆయన్ని ఇన్చార్జిగా పెట్టి కార్యక్రమాలను చేస్తుంది టిడిపి. ఈ పోస్టర్లు అంటించిన పని మాది కాదని, వైసీపీలోని అంతర్గత విభేదాలే కారణమై ఉండొచ్చని టిడిపి ఇన్చార్జి గండి బాబ్జి చెప్తున్నాడట. అదే సమయంలో జనసేన కు కూడా ఆ నియోజకవర్గంలో బలమైన నేత ఎవరూ లేరు. వాళ్లు కూడా అలాంటి పోస్టర్లు అంటించే సాహసం చేసే నేత అక్కడ ఎవరు లేరని చెబుతున్నారట. దీంతో సొంత పార్టీలోని ఆధిపత్య రాజకీయ నేపథ్యంలోనే ఈ పోస్టర్లను అంటించారన్నది వాసుపల్లి వాదన. ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశారట. పోస్టర్లు అంటించిన వారిని గుర్తించాలని కోరారట. ప్రాథమిక సమాచారాన్ని తీసుకొని ఇక అధిష్టానం వద్ద తాడోపేట తేల్చుకోవాలని వాసుపల్లి గణేష్ నిర్ణయించుకున్నాడట. ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో ఇంకా ఇలాంటి అడ్డంకులు, అంతర్గత సమస్యలు ఉంటే మళ్ళీ ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని, ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని పార్టీ రీజినల్ ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డిని కోరాలని వాసుపల్లి సిద్ధమవుతున్నాడట
అయితే సీతంరాజు సుధాకర్ కూడా తనకి ఆ పోస్టర్లతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాడట. వాసుపల్లి గణేష్ టిడిపి నుంచి వైసీపీలోకి రావడం వైసిపి శ్రేణులకి వాసుపల్లితో వచ్చిన టిడిపి నేతలకు మధ్య సయోధ్య లేకపోవడం తో అక్కడ అంతర్గతంగా ఇబ్బందులు ఉన్నాయని, ఆయన పార్టీ మారతారని ఆయన సొంత అనుచరులే చెబుతున్నారని ఆ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఈ పోస్టర్లు అంటించి ఉంటారని సుధాకర్ చెప్తున్నాడట. వైసిపి కార్యకర్తలు ఎవరు ఇలాంటి పని చేయరని, వాసుపల్లి అనుచరులు కాకపోతే, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ చేసి ఉండొచ్చన్నది ఆయన వాదనట. అలాంటి పోస్టర్లు అంటించాల్సిన అవసరం తనకు లేదని, పార్టీ అధిష్టానం ఎలా చెప్తే అలా నడుచుకుంటానని సుధాకర్ చెప్తున్నాడట ఈ నేపథ్యంలో ఈసారి ఈ పోస్టర్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న గణేష్ తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకోవడంతో మరొక రామచంద్రపురం లాంటి వ్యవహారం విశాఖ నగరంలో కూడా రాబోతోందన్నది రాజకీయ వర్గాలు విశ్లేషణ.